Begin typing your search above and press return to search.
మైండ్ బ్లాక్ అయ్యేలా షాకిచ్చిన లంక
By: Tupaki Desk | 15 Aug 2015 5:00 PM ISTఒక టెస్ట్ మ్యాచ్ లో అనూహ్య ఫలితం ఏర్పడటం చాలా అరుదు.అందులోకి తాజాగా చోటు చేసుకున్న మేజిక్ టెస్టు క్రికెట్ లో ఒక సంచలనంగా చెప్పాలి. ఎందుకంటే.. ఒక జట్టు తన మొదటి ఇన్నింగ్స్ లో 183 పరుగులకు ఆలౌట్ అయితే.. దాని ప్రత్యర్థి జట్టు తన మొదటి ఇన్నింగ్ లో 375 పరుగులు చేయటం.. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి జట్టు 367 పరుగులు చేసి అలౌట్ అయిన పరిస్థితి.
అంటే.. రెండో జట్టు 176 పరుగులు చేస్తే విజయం సాధించే లక్ష్యం.మరి.. ఈ లక్ష్యాన్ని రెండో జట్టు సాధిస్తుందా? అని అడిగితే.. క్రికెట్ తెలిసిన చిన్నపిల్లాడు కూడా రెండో జట్టు అలవోకగా ఆడేసి.. అద్భుత విజయం సాధించినట్లేనని చెబుతారు. మరి.. ఇంతకీ ఏం జరిగింది? చిన్న పిల్లాడికి కూడా తెలిసిందే జరిగిందా? లేదనే చెప్పాలి.
క్రికెట్ లో అనూహ్య పరిణామాలు కొత్తేం కానప్పటికీ.. ఇంతటి అనూహ్య పరిణామం చాలా అరుదుగా చోటు చేసుకుంటుందని చెప్పాలి. ఇంతకీ మొదటి జట్టు శ్రీలంక అయితే.. రెండో జట్టు భారత్. ఊహించని విజయానికి లంక సారథి తన నోటికి మాటలు రావటం లేదని చెప్పుకొచ్చాడు. అద్భుతమైన విజయాన్ని సాధించిన సమయంలో తన భావోద్వేగాన్ని ఆయన అలా చెప్పుకొచ్చారు.
మరింత సంచలనం విజయాన్ని శ్రీలంక ఎలా సొంతం చేసుకుందన్న విషయాన్ని వస్తే.. కేవలం 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 23 పరుగులు చేసింది. అంటే.. చేతిలో తొమ్మిది వికెట్లు ఉండగా.. సాధించాల్సిన పరుగులు కేవలం 153 పరుగులు మాత్రమే చేయాలి.
విజయం ఖరారు చేసుకొని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని ఉత్సాహంగా శనివారం బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఊహించని పరిణామం ఎదురైంది. లంకేయులు విసిరిన లక్ష్యాన్ని చేరుకునేందుకు తొమ్మిది మంది బ్యాట్స్ మెన్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. 63పరుగుల తేడాతో అత్యంత ఘోరంగా ఫెయిల్ అయ్యింది.
లంక బౌలర్ రంగన హెరాత్ తన స్పిన్ మాయాజాలంతో టీమిండియాకు పీడకలలాంటి ఓటమి చవిచూసేలా చేశారు. హెరాత్ తన అద్భుతమైన స్పిన్ తో ఏడు వికెట్లు తీసుకోవగా.. కౌశల్ మూడు వికెట్లు సాధించి.. టీమిండియా నడ్డి విచిరారు. నాలుగో రోజు 153 పరుగులు చేస్తే చాలు విజయం సొంతం అవుతుందని భావించిన స్థానే.. 90 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అజింక్యా రహానే 36 పరుగులు.. శిఖర్ దావన్ 28 పరుగులు (ఇద్దరివి కలిపితే 63 పరుగులు) మాత్రమే చేశారు. మిగిలిన వారంతా క్రీజ్ లోకి రావటం.. ప్యాడ్లు సర్దుకోవటం.. పెవిలియన్ బాట పట్టటంతో టీమిండియా ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో మూడు టెస్టుల సీరిస్ లో శ్రీలంక 1-0 తో ముందంజలో ఉంది.