Begin typing your search above and press return to search.

ఇకపై 24 గంటలూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయొచ్చు

By:  Tupaki Desk   |   24 July 2022 10:17 AM IST
ఇకపై 24 గంటలూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయొచ్చు
X
కీలక నిర్ణయాన్ని తీసుకున్నది నరేంద్ర మోడీ సర్కార్. ఇప్పటివరకు జాతీయ జెండాను ఎగురవేసే విషయంలో ఉన్న పరిమితుల్ని పూర్తిగా ఎత్తివేస్తూ తీసుకున్న కీలక నిర్ణయం ఆసక్తికరంగానే కాదు.. దేశ ప్రజలంతా హ్యాపీగా ఫీలయ్యే పరిస్థితి. దశాబ్దాల తరబడి జాతీయ పతాకమైన త్రివర్ణ పతాకాన్నిఉదయం ఎగురవేసి.. సాయంత్రం నాటికి అవనతం చేసేవారు. దీనికి సంబంధించి ఉన్న నిబంధనను తాజాగా మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇప్పటివరకు ఉన్న ప్లాగ్ కోడ్ కు సంబంధించిన మార్పులు చేపట్టారు. ఇప్పటివరకు యంత్రంతో రూపొందించిన జెండాలు.. పాలిస్టర్ పతాకాలపై బ్యాన్ ఉండేది. ఆ నిబంధనను కూడా మార్చారు. ఆజాదీ కా అమ్రత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 మధ్యన హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీదా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన వైనం తెలిసిందే.

ఈ పిలుపునకు అడ్డుగా ఉన్న నిబంధనల్ని మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులో ప్రధానమైనది సమయం. ఇప్పటివరకు ఉన్న ప్లాగ్ టైంను మార్చేశారు. 24 గంటలూ జాతీయ జెండాను ఎగురవేసేందుకు అనుమతులు మంజూరు చేశారు. అంతేకాదు.. చేతితో నేసిన జాతీయ పతాకాలు మాత్రమే కాదు.. యంత్రాలతో రూపొందించిన కాటన్.. పాలిస్టర్.. ఉన్ని.. సిల్కు జెండాలను ఉపయోగించుకునేందుకు సైతం అనుమతిని ఇచ్చారు. మరి.. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు దేశ ప్రజల నుంచి ఏ రీతిలో స్పందన ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.