Begin typing your search above and press return to search.

మా అన్నను చంపిన ఏ ఒక్కరిని వదలిపెట్టను: హేమంత్ తమ్ముడు !

By:  Tupaki Desk   |   26 Sept 2020 11:00 PM IST
మా అన్నను చంపిన ఏ ఒక్కరిని వదలిపెట్టను: హేమంత్ తమ్ముడు !
X
మరో పరువు హత్య జరిగింది. కూతురి ప్రేమ పెళ్లిని అంగీకరించక కిరాయి రౌడీలకి సుపారీ ఇచ్చి, ఆమె భర్తను చంపించిన తల్లిదండ్రులు. రెండేళ్ల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్‌ హత్యను రాష్ట్ర ప్రజలు ఇంకా పూర్తిగా మరువక ముందే సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్‌ నగర శివారులో చోటుచేసుకోవడం గమనార్హం. తమ కులం కాని, తమ అంతస్తుకు తగని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్నవారే కర్కశంగా కూతురి భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించారు. చేజేతులా కూతురి జీవితాన్ని మొగ్గలోనే తుంచేశారు. పాపం ఎవరిదైనా అవంతి జీవితం మాత్రం అన్యాయం అయిపోయింది.

ఇదిలా ఉంటే .. తన అన్నను చంపిన ఏ ఒక్కరిని ఊరికే వదిలిపెట్టను అంటూ హేమంత్ సోదరుడు సుమంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యా ఘటనకు రెండు రోజుల ముందు కూడా హేమంత్ తనకు ఫోన్ చేశాడని గుర్తు చేసుకొని తీవ్ర భాగోద్వేగానికి గురైయ్యాడు. వ్యక్తిగత విషయాలే కాకుండా ఇద్దరం అప్పుడప్పుడూ తమ బిజినెస్ వ్యవహారాలు కూడా చర్చించుకుంటూ, రెండ్రోజుల ముందు కూడా తమ వ్యాపారం గురించి సూచనలు పంచుకున్నట్లు తెలిపాడు. శుక్రవారం తన తల్లిదండ్రులు తనకు వీడియో కాల్ చేసి అన్నయ్య మృతదేహాన్ని చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నను చంపిన వారిని ఎవరినీ వదలనని హెచ్చరించారు. చెప్పులతో కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారని మండిపడ్డారు. గతంలో తమ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు సుమంత్ తెలిపారు. హత్యకు కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.