Begin typing your search above and press return to search.

ఓట్ల కోసం హేమమాలిని ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   1 April 2019 12:52 PM IST
ఓట్ల కోసం హేమమాలిని ఏం చేసిందంటే?
X
తెలంగాణ ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడా చిత్రాలు సార్వత్రిక, ఏపీ ఎన్నికల్లోనూ దర్శనమిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల వేళ ఓ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లవాడి ముడ్డి కడిగి వార్తల్లో నిలిచాడు. తాజాగా లోకేష్ బాబు మంగళగిరిలో ఓ బార్బర్ షాపులో కటింగ్ చేసి ఫేమస్ అయ్యాడు. ఇలా నేతల చిత్రవిచిత్రాలు ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగా ఇప్పుడు మొదలయ్యాయి.

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రముఖ నటి, బీజేపీ మధుర పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అయిన హేమమాలిని రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధుర నియోజకవర్గంలోని గోవర్ధన క్షేత్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు. పొలాల వెంట వెళుతూ స్థానిక మహిళా రైతుల వద్దకు వెళ్లారు. కొడవలి చేతబట్టి స్వయంగా వరితో కలిసి వరిపంట కోశారు. వరి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హేమమాలిని మహిళా రైతు అవతారం ఎత్తడం.. ఆ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఎన్నికల ప్రచారం మొదటిరోజే కొడవలి పట్టి కోసేసిన హేమామాలిని ముందు ముందు ఇంకా ఎన్ని పనులు చేస్తుందోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.