Begin typing your search above and press return to search.

యవ్వనం మాటలతో..యూత్ కి ఛాన్స్ ఎక్కడ?

By:  Tupaki Desk   |   1 March 2017 11:29 AM IST
యవ్వనం మాటలతో..యూత్ కి ఛాన్స్ ఎక్కడ?
X
కొందరి నోట కొన్ని మాటలు పెద్దగా నప్పవు.కానీ.. వారు అలాంటి విషయాలే ప్రస్తావిస్తుంటారు. ఆరుపదుల వయసు దాటిన తర్వాత.. అందం.. యవ్వనంగా కనిపించటం లాంటి మాటలు బాగుంటాయా? అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసేస్తుంటారు ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని. ఎంపీగా.. ఆమె చేయాల్సిన పనుల కంటే కూడా.. అందంగా కనిపించటం ఎలా అన్నఅంశం మీదనే ఆమె.. ఆమెను ఇంటర్వ్యూ చేసే వారి దృష్టి ఉన్నట్లు కనిపిస్తుంటుంది.

తాజాగా తన అందం గురించి.. తాను యవ్వనంగా కనిపించటం గురించి హేమమాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యవ్వనంగా కనిపించటం వెనుక సీక్రెట్ చెప్పేస్తానన్న ఆమె.. తన వయసు కంటే పదేళ్లు తక్కువ అన్నట్లుగా అనుకుంటే చాలని.. అదే యవ్వనంగా కనిపించేలా చేస్తుందని చెప్పుకొచ్చారు. అందరూ ఇదే విధానాన్ని అలవర్చుకోవాలన్న ఉచిత సలహా కూడా ఇచ్చేశారు.

ముసలివాళ్లమని ఎప్పుడూ భావించకూడదని.. మనిషి జీవితంలో వృద్ధాప్య దశతప్పదని.. కానీ.. మనం ఎప్పుడూ యవ్వనంలో ఉన్నట్లే ఫీల్ కావాలని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వయసు పైబడిన వారే ఉంటారని.. ఈ విధానాన్ని యూత్ మార్చాలని అభిప్రాయ పడ్డారు. యువత రాజకీయాల్లోకి ప్రవేశించాలన్నారు. అంతా బాగానే ఉంది కానీ.. హేమమాలిని చెప్పినట్లుగా ఉన్నవయసుకు పదేళ్లు తక్కువ వేసుకోవాలన్న సలహాకు తగ్గట్లే.. వయసు మళ్లిన వారు తమ వయసును తగ్గించుకోవటంతో యూత్ కి అవకాశాలు ఎక్కడ లభిస్తాయి? పదేళ్లు చిన్నగా ఫీల్ కావటం ద్వారా.. తాము మరికొంత కాలం రాజకీయాలు కొనసాగించాలన్న భావనలో సీనియర్లు ఉండటం.. దీంతో యూత్ కి అవకాశాలు రాని పరిస్థితి. ఒకవైపు యూత్ పాలిటిక్స్ లోకి రావాలని చెబుతూనే.. వచ్చినోళ్లకు ఏ మాత్రం ఇవ్వని రీతిలో యవ్వన మాటలు చెబుతున్న హేమను ఏమనాలంటారు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/