Begin typing your search above and press return to search.

చెల్లిని పుట్టింటికి తీసుకుపోవడానికి ఏకంగా హెలికాప్టర్‌ దించేశాడు !

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:01 PM IST
చెల్లిని పుట్టింటికి తీసుకుపోవడానికి ఏకంగా హెలికాప్టర్‌ దించేశాడు !
X
అన్నా చెల్లెళ్ల ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరి పై మరొకరికి అమితమైన ప్రేమ ఉంటుంది. ఇంట్లో ఎప్పుడూ కొట్టుకుంటూ , తిట్టుకుంటూ ఉన్నా కూడా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమ మాత్రం అమోఘం. అయితే , తాజాగా ఓ అన్న , తన సోదరిని అత్తింటి నుండి పుట్టింటికి తీసుకుపోవడానికి ఏకంగా హెలికాప్టర్ వేసుకొని వెళ్లాడు. మాములుగా ఎవరైనా కూడా సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి తీసుకురావడానికి బైక్‌ లేదా ఆటోలో వెళతారు. కొంత ఆర్థికంగా ఉన్నవారైతే సొంత కారులో లేదా అద్దె వాహనంలో వెళతారు.

కానీ, జల్గావ్‌ జిల్లాలో తన సోదరిని అత్తారింటి నుంచి పుట్టింటికి ఏకంగా హెలికాప్టర్‌ లో తీసుకోం వెళ్లడంతో తీవ్ర చర్చనీయంశమైంది. తన సోదరికి వినూత్నంగా స్వాగతం పలకాలనే ఉద్ధేశంతో విరాజ్‌ కావడియా అనే వ్యక్తి ఈ ఏర్పాట్లు చేశాడు. అకస్మాత్తుగా హెలికాప్టర్‌ గ్రామంలో ల్యాండ్‌ కావడంతో కాసేపు గ్రామస్తులకు అర్థం కాలేదు. తరువాత ఇటీవల పెళ్లయిన తన సోదరిని పుట్టింటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌ లో వచ్చినట్లు తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

జల్గావ్‌ జిల్లాకు చెందిన శివాని కావడియా పెళ్లి పర్లీలోని వైజ్యనాథ్‌ ప్రాంతంలో ఉంటున్న జైన్‌ కుటుంబానికి చెందిన డాక్టర్‌ కుణాల్‌ జైన్‌తో ఇటీవల పెళ్లైంది. కుటుంబ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన కొద్ది రోజులకు పెళ్లి కూతురును పుట్టింటికి తీసుకురావాలి. దీంతో తన సోదరిని తానే తీసుకురావాలని సోదరుడు విరాజ్‌ కావడియా భావించాడు. కానీ, కారులో లేదా బైక్‌పై తీసుకురావడం సర్వసాధారణం. దీంతో సర్‌ఫ్రైజ్‌ చేయాలని కొత్త పద్దతిని ఆలోచించాడు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని సోదరి గ్రామానికి వెళ్లాడు. ఊరు బయటున్న బారిస్టర్‌ నికం మైదానంలో ల్యాండింగ్‌ చేశాడు.