Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మహానగరాన్ని ముద్ద చేసిన ‘మహా’ వర్షం
By: Tupaki Desk | 10 Oct 2020 10:30 AM ISTనిన్న (గురువారం) ఉదయం ఎండ.. మధ్యాహ్నం ఆ తీవ్రత ఎక్కువగా ఉంటే.. సాయంత్రం ఐదు గంటల వరకు వాతావరణ పరిస్థితులన్ని సాధారణంగానే ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. అప్పటివరకు మామూలుగానే ఉన్న పరిస్థితులుసాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అలా మొదలైన మార్పు.. మరో అరగంట గడిచేసరికి చీకట్లు కమ్ముకోవటమే కాదు.. భారీ వర్షం పడటం ఖాయమన్న సంకేతాన్ని ఇచ్చింది. దీన్ని గుర్తించి.. జాగ్రత్త పడే లోపు మొదలైన భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది.
అలా ఆరింటికి మొదలైన వర్షం మూడు గంటల పాటు దంచి కొట్టింది. అది కూడా ఎంత తీవ్రంగా అంటే.. ఒక్క ఆసిఫాబాద్ ప్రాంతంలో 15.1 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైతే.. విజయనగర కాలనీలో 12.9 సెం.మీ., బంజారాహిల్స్ లో12.7, జూబ్లీహిల్స్ లో 11.5, షేక్ పేటలో 12.5, ఖైరతాబాద్ లో 12.3 చొప్పున పడింది. పది సెంటీమీటర్ల చొప్పున వర్షాలు కురిసిన ప్రాంతాలుగా వీటిని చెప్పాలి. మిగిలినోట్ల ఇంత తీవ్రంగా కాకున్నా.. సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు కురిశాయి.
గంట వ్యవధిలో కురిసిన వర్షాలతో మోకాలి లోతుకు పైనే వర్షపు నీరు హైదరాబాద్ నగర రోడ్ల మీద నిలిచిపోవటంతో వాహనదారులు.. పాదచారులు.. లోతట్టు ప్రాంతాలు.. ఇలా వాళ్లు కాదు.. వీళ్లు కాదు అన్నట్లుగా అందరూ తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక.. వాహనదారులు పడిన కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అర కిలోమీటరు దూరానికి సైతం నలభై నిమిషాలకు పైనే సమయం తీసుకోవటం గమనార్హం. అప్పటికప్పుడు వాతావరణం చల్లబడటం.. ఆ పై మొదలైన వర్షం నగరజీవికి చుక్కలు చూపించింది.
గడిచిన పదేళ్లలో అక్టోబరులో నెలలో ఇంత భారీ వర్షం 2013లో కురిసినట్లు చెబుతున్నారు. 2013 అక్టోబరు 26న 19.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా 15.1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అయితే.. తాజా వర్షపాతమే తీవ్రమైనది. ఎందుకంటే ఇంత భారీ వర్షం అతి తక్కువ వ్యవధిలో నమోదు కావటం గమనార్హం. తాజా వర్షంతో 117 ఏళ్ల నాటి రికార్దుల్ని చెరిపివేసింది.
117 ఏళ్ల క్రితం అంటే.. 1903లో అక్టోబరు ఆరున 11.7 సె.మీ. వర్షపాతం నమోదైంది. ఇదే అప్పటివరకు ఉన్న అత్యధికం తర్వాత 2013లో కురిసినప్పటికీ.. ఒకే ప్రాంతంలో ఒకే సమయంలో పది సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం పది ప్రాంతాల్లో కురవటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. 1908లో 36 గంటల్లో 43 సె.మీ. వర్షపాతం నమోదైతే.. 2000లో 24 గంటల వ్యవధిలో 24.1 సె.మీ. వర్షపాతం నమోదైంది. తాజాగా కురిసిన భారీ వర్షం కేవలం రెండు గంటల్లోనే కావటం.. అది కూడా 15 సె.మీ. కావటం గమనార్హం.
నగరంలోని పలు చోట్ల కురిసిన వర్షాన్ని సరాసరి చేస్తే తగ్గుతుంది. కానీ.. తక్కువ వ్యవధిలో ఆకాశానికి చిల్లుబడినట్లుగా కురిసిన వర్షం హైదరాబాదీయులకు భారీ షాక్ ను ఇచ్చిందని చెప్పక తప్పదు. క్యుములోనింబస్ మేఘాల కారణంగానే అతి తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం పడినట్లుగా చెబుతున్నారు. ఏమైనా తాజా వర్షం.. దాని కారణంగా తమకు ఎదురైన చేదు అనుభవాల్ని నగర ప్రజలు అయితే.. ఇప్పట్లో మర్చిపోలేరని చెప్పక తప్పదు.