Begin typing your search above and press return to search.
కమ్ముకున్న మబ్బులు.. విడవని వానతో హైదరాబాద్ తడిచి ముద్ద
By: Tupaki Desk | 26 Sept 2020 11:45 AM ISTగతానికి భిన్నమైన అనుభవం హైదరాబాదీయుల సొంతమవుతోంది. గతంలో ఎప్పుడో ఒకసారి పలుకరించే వర్షాలు. అది కూడా ఒకట్రెండు రోజులే. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి. వర్షం మొదలైతే చాలు.. ఒకట్రెండు రోజులు కాదు.. ఏకంగా వారం.. పది రోజుల పాటు విడవకుండా వానలు కురుస్తున్న వైనం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి చోటు చేసుకుంది.
మొన్నటికి మొన్న వారానికి పైగా హైదరాబాద్ ను మబ్బులు చుట్టేసి.. విడవని వాన జల్లులతో భాగ్యనగరి వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తాజాగా నిన్నటినుంచి మరోసారి వర్షం విడవకుండా కురుస్తోంది. దీంతో.. హైదరాబాద్ నగరం మొత్తం వాన గుప్పిట్లో చిక్కుకున్నటైంది. శుక్రవారం నుంచి మొదలైన ఈ వర్షం ఈ రోజు (శనివారం) ఉదయం నుంచి పెద్ద ఎత్తున కురుస్తోంది.
అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు భారీగా పడుతున్నాయి. దీంతో.. రోడ్లు మొత్తం జలమయంగా మారాయి. హస్తినాపురంలో 9.8 సెంటీమీటర్లు.. కందికల్ గేట్ వద్ద 7.2 సె.మీ., సరూర్ నగర్ లో 6.8 సె.మీ, చార్మినార్ 6.8 సె.మీ., చాంద్రాయణగుట్ట 6.5సె.మీ., మారేడుపల్లిలో 6.4సె.మీ., ఎల్ బీ నగర్ లో 6.4. సె.మీ., తార్నాకలో 5.9 సె.మీ. వర్షపాతం నమోదైంది. ఈ తెల్లవారు జాము నుంచి వర్షం మరింత ఎక్కువైంది. ఆకాశం నల్లటి మబ్బులతో నిండిపోవటంతో.. ఉదయమైనా చీకట్లు కమ్ముకున్నట్లుగా వాతావరణం మారింది. లోతట్టు ప్రాంతాలు వాన నీటితో కొత్త ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. చెరువు కట్టలకు వెళ్లే దారుల్లో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. విడవకుండా కురుస్తున్న వర్షాలతో నగర వాసులు కష్టాల్ని ఎదుర్కొంటున్నారు.