Begin typing your search above and press return to search.
వర్ష బీభత్సం: హైదరాబాద్ లో విషాదం
By: Tupaki Desk | 14 Oct 2020 8:30 AM ISTహైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న ఆంధ్రాలో తీరం దాటిన తుఫాన్ తెలంగాణలోనూ కుంభవృష్టి కురిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో జలవిలయం సంభవించింది.
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీవర్ష బీభత్సానికి చాంద్రాయణగుట్టలోని గౌన్ నగర్ లో రెండు ఇళ్లు కూలిపోయాయి. పాతబస్తీలో జరిగిన ఈ దుర్ఘటనలో 9మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎత్తైన ప్రదేశంపై ఉన్న ఇళ్లపై బండరాళ్లు జారిపడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఓ ఇంట్లో ఐదుగురు మృతిచెందగా.. మరో ఇంట్లో నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉండడం విషాదం నింపింది. ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. మృతుల్లో రెండు నెలల చిన్నారి ఉన్నట్టు సమాచారం.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలంలో ఫలక్ నుమా ఏసీబీ ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదానికి బండ్లగూడలోని మహ్మదియా నగర్ లోని ఓ పహిల్వాన్ కు చెందిన ఫామ్ హౌస్ గ్రానైట్ గోడ కూలి పక్కన ఉన్న రెండు ఇళ్లపై పడింది. ఈ క్రమంలోనే ఎనిమిది మంది మరణించారు. మృతులంతా రెండు కుటుంబాలకు చెందిన వారే. గాయపడిన వారిని మొగల్ పుర ఆస్రా ఆస్పత్రికి తరలించారు.