Begin typing your search above and press return to search.
హైదరాబాద్ సమీపంలో 30 మంది గల్లంతు.. ముగ్గురి మృతి
By: Tupaki Desk | 14 Oct 2020 2:40 PM ISTతీరం దాటిన వాయుగుండం తీరని నష్టాన్ని మిగులుస్తోంది. విశాఖపట్నం-నర్సాపుర్ మధ్యం తీరం దాటి ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో అయితే కుండపోత వాన పడుతోంది. వరద ఉధృతికి హైదరాబాద్ నీట మునిగింది.
భారీ వర్షాలకు హైదరాబాద్ లోని హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారి రోడ్డు కోతకు గురైంది. గగన్‌పహాడ్ సమీపంలోని అప్పా చెరువు కట్ట తెగి జాతీయ రహదారిపై వరదనీరు చేరడంతో రహదారి ధ్వంసమైంది.
ఈ ఘటనలో రహదారిపై వెళ్తున్న వాహనాలు వరదనీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 30 మంది గల్లంతైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.
రోడ్డు కోతకు గురైన ప్రాంతాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు.జాతీయ రహదారిని మూసివేసి ట్రాఫిక్ ను ఔటర్ రింగ్ రోడ్డుకు మళ్లించినట్టు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తెలిపారు. అటు వైపు ప్రయాణికులు వెళ్లవద్దని సూచించారు.