Begin typing your search above and press return to search.
వరుణదేవుడి కన్ను బెంగళూరు మీద పడింది.. భారీ వర్షాలతో సుందర నగరం అతలాకుతలం
By: Tupaki Desk | 24 Oct 2020 2:40 PM ISTఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలతో దేశంలోని ప్రధాన నగరాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పటికే ముంబై, హైదరాబాద్ లాంటి నగరాలు భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చి.. బయటకు వెళ్లే దారిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలతో భాగ్యనగరం తడిసిముద్దైంది. హైదరాబాద్‌లో వరద ఇంకా తగ్గనే లేదు. ఇప్పటికీ ఎన్నో కాలనీలు వరద ముంపులో ఉన్నాయి. అయితే తాజాగా బెంగళూరు నగరాన్ని వర్షం ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీట మునిగాయి. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శుక్రవారం బెంగళూరులోనూ కుండపోత వాన కురిసింది. జనం వరద ప్రవాహంలో కూరుకుపోయారు. కొంతకాలంగా హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన.. ఇప్పుడు బెంగళూరుపై పడ్డట్టు కనిపిస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కర్ణాటక రాజధాని బెంగళూరు కకావికలమైంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి చినుకు చినుకుగా మొదలైన వాన చూస్తుండగానే కుండపోతగా మారింది. ఆ వాన బీభత్సం 5.30 గంటల వరకూ కొనసాగింది. ఇంకేం.. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీటితో నిండాయి. బాధితుల గుండె చెరువైంది. రహదారులు నదులను తలపిస్తున్నాయి. వర్షానికి దక్షిణ బెంగళూరుకు భారీగా వరద వ్యాపించింది. హోసకెరిహళ్లి ప్రాంతంలోని గురుదత్తా లేఔట్ లో వరద ప్రవాహం లో ఓ కారు కొట్టుకు పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మైసూరు రోడ్డు, సిల్క్ బోర్డు జంక్షన్, హోసూర్ రోడ్, బన్నెర్‌ఘట్ట రోడ్, బసవనగుడి ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బెంగళూరు నగర పాలక సంస్థ సిబ్బంది, నగర పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
సుమారు 20 బోట్ల ద్వారా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. మోటార్ల సాయం తో నీటిని తోడి పోస్తున్నారు.బెంగళూరులో శుక్రవారం 13.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హాల్ ఎయిర్‌పోర్టు ప్రాంతం లో 1.3 మి.మీ. వర్షపాతం రికార్డవగా.. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంతంలో 7.7 మి.మీ వర్షపాతం కురిసింది. జయనగర, బసవనగుడి, ఆర్‌ఆర్ నగర్, కోరమంగళ, నగరబావి, మల్లేశ్వరం తదితర ప్రాంతాల్లో వర్షంతో అతలాకుతలమయ్యాయి. రాబోయే 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.