Begin typing your search above and press return to search.

జల దిగ్బంధంలో అసోం..తిండి, నీళ్లు కూడా దొరకక అష్టకష్టాలు !

By:  Tupaki Desk   |   31 Aug 2021 3:20 PM IST
జల దిగ్బంధంలో అసోం..తిండి, నీళ్లు కూడా దొరకక అష్టకష్టాలు !
X
ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షానికి అసోం వణికిపోతోంది. దీనితో వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాలు బయటపెట్టడానికి కూడా వీలులేకుండా ఉంది. దీనితో వంట చేసుకుందామంటే, సరుకులు లేవు, తినడానికి తిండ లేదు, తాగడానికి నీళ్లు కూడా లేవు. అంతా నీటి మయం. ఎటు చూసినా,నీరే కనిపిస్తోంది. ఇంట్లో ఉన్న బియ్యం నీట మునిగాయి, తెచ్చుకున్న సరుకులు పాడయ్యాయి. రోజుల తరబడి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అసోం జనం ఆర్తనాదాలు చేస్తున్నారు.

భారీ వర్షాలకు అసోం అతలాకుతలం అవుతోంది. 21 జిల్లాలు నీటిలోనే ఉన్నాయి. మొత్తంగా అసోం రాష్ట్రంలో 3 లక్షల 63 వేల మంది లక్షల మంది వరదల బారిన పడ్డారు. బార్ పేట, మోరిగావ్ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు వరదనీటిలో కొట్టుకుపోయారు. ఈ 21 జిల్లాల్లో 3 లక్షల 63 వేల మంది వరదల వల్ల అవస్థలు పడుతున్నారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ప్రకటించింది. ఒక్క లఖింపూర్ జిల్లాలోనే దాదాపు లక్షా 30 వేల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు.

బ్రహ్మపుత్ర నదితోపాటు దాని ఉపనదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో 30 వేల హెక్టార్లలో పంటలు నీటమునిగాయి. 21 జిల్లాల్లోని 950 గ్రామాలు నీట మునగడంతో జనజీవనం మొత్తం అస్తవ్యస్తమైంది. నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరదనీటి ధాటికి బార్ పేట, దరాంగ్, గోలాఘాట్,చ మోరిగావ్, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఒక్క లఖింపూర్ జిల్లాలోనే దాదాపు 1.3 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నదితోపాటు దాని ఉపనదులు వరదనీటితో పొంగి ప్రవహిస్తుండటంతో 30,333 హెక్టార్లలో పంటలు నీటమునిగాయి.21 జిల్లాల్లోని 950 గ్రామాలు నీట మునగడంతో ప్రజల సాధారణ జనజీవనానికి ఆటంకం కలిగింది.అసోంలో నదులు ప్రమాదస్థాయి కంటే మించి ప్రవహిస్తున్నాయి. అసోంలోని వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి.