Begin typing your search above and press return to search.

భారీగా పరిగిన ఇంధన ధరలు .. సైకిల్‌ పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే!

By:  Tupaki Desk   |   19 Feb 2021 5:00 PM IST
భారీగా పరిగిన ఇంధన ధరలు .. సైకిల్‌ పై అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే!
X
గత పదకొండు రోజులుగా దేశంలో ఇంధన ధరలు పెరుగుతూపోతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండో రోజు కూడా పెరగడం, గ్యాస్ ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ఇప్పటికే 100 దాటిపోయింది. దీనితో సామాన్య ప్రజానీకంతో పాటు ప్రజా ప్రతినిదులు కూడా ప్రభుత్వాలను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ పద్ధతుల్లో తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

తాజాగా బీహార్‌లో బడ్జెట్ సెషన్ ప్రారంభం కావడంతో అసెంబ్లీ మొదటి రోజున ప్రతిపక్ష ఆర్జేడీకి చెందిన మహువా ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ పాట్నాలోని అసెంబ్లీకి సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చారు. ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంపై తన నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశారు. ను హాజీపూర్ నుంచి ఉదయం 7గంటలకు సైకిల్ మీద బయలుదేరాను. ప్రస్తుతం ఇంధన ధరలు భారీగా పెరగడంతో రాష్ట్రంలో ఏది కొనే పరిస్థితి లేదు, అలాగే బీహార్‌లో నేరాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వీటి విషయంపై ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం" అని ముఖేష్ మీడియాకు తెలిపారు.