Begin typing your search above and press return to search.

నిప్పులు కురుస్తున్న ఏపీ అసెంబ్లీ!!

By:  Tupaki Desk   |   21 Sep 2022 7:39 AM GMT
నిప్పులు కురుస్తున్న ఏపీ అసెంబ్లీ!!
X
ఏపీ అసెంబ్లీ ఒక్క‌సారిగా నిప్పుల కొలిమిగా మారిపోయింది. అధికార, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య మాట‌ల యుద్ధం.. వాద‌న‌లు.. వ్యాఖ్య‌లు.. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల‌తో.. స‌భలో నిప్పులు కురిశాయా? అన్న విధంగా.. వ్య‌వ హారం మారిపోయింది. విజ‌య‌వాడ‌లోని ప్ర‌ఖ్యాత వైద్య ఆరోగ్య విశ్వ‌విద్యాల‌యానికి ఉన్న ఎన్టీఆర్ పేరును .. వైఎస్ ఆర్ పేరుగా మారుస్తూ.. ప్ర‌భుత్వం బిల్లును ప్ర‌వేశ పెట్టింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ.. ఈ బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు.

అయితే.. దీనిని ఆది నుంచి కూడా.. వ్య‌తిరేకిస్తున్న టీడీపీ స‌భ్యులు.. ఒక్క‌సారిగా.. ఆందోళ‌న‌కు దిగారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఎన్టీఆర్ పేరు మార్చ‌డానికి వీల్లేద‌ని.. అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చ‌య్య చౌద‌రి.. వంటిప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు.. నినాదాల‌తో స‌భ‌ను హోరెత్తించారు. అయితే.. అదేస‌మ యంలో.. వైసీపీ త‌ర‌ఫున‌.. స‌భ్యులు ధ‌ర్మ‌శ్రీ, కొరుముట్ల శ్రీనివాసులు.. సామినేని ఉద‌య భాను.. త‌దిత‌రులు.. అదే రేంజ్ లో విరుచుకుప‌డ్డారు.

ఎన్టీఆర్‌పై అభిమానం.. అంటే.. మాదనేన‌ని.. ఆయ‌న పేరును జిల్లాకు పెట్టామ‌ని.. మ‌రి చంద్ర‌బాబు ఎందుకు పెట్ట‌లేద‌ని.. ఎదురు ప్ర‌శ్నించారు. క‌నీసం .ఒక్క ప్రాజెక్టుకైనా.. చంద్ర‌బాబు ఎన్టీఆర్ పేరు పెట్టారా? అని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నించారు.

అస‌లు కేంద్రంలోని ప్ర‌భుత్వంతో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగి.. కూడా.. ఎన్టీఆర్‌కు భార‌త ర‌త్న ఎందుకు తేలేద‌ని.. ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో టీడీపీ స‌భ్యులు సైతం ఎదురు దాడి చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురావ‌డం చేత‌కాని.. నేత‌ల‌కు పేర్లు మార్చుకోవ‌డం ఒక్క‌టే తెలుస‌ని ఎద్దేవా చేశారు.

దీంతో స‌భ‌లో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాల మ‌ధ్యే.. టీడీపీ స‌భ్యులు.. స్పీక‌ర్ పోడియం లోకి దూసుకు వెళ్లారు. దీంతో.. వైసీపీ స‌భ్యులు కూడా.. .. .. స్పీక‌ర్ పోడియంలోకి దూసుకువెళ్లారు. అంతేకాదు.. ఇరు ప‌క్షాలు కూడా ఒక‌రిపై ఒక‌రు.. నినాదాలు చేసుకున్నారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా సునామీ వంటి వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స్పీక‌ర్ స‌భ‌ను వాయిదావేశారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.