Begin typing your search above and press return to search.

మునక్కాయ కూరతో జీడిపప్పును కలిపితే దున్నేయొచ్చట!

By:  Tupaki Desk   |   20 April 2020 2:30 AM GMT
మునక్కాయ కూరతో జీడిపప్పును కలిపితే దున్నేయొచ్చట!
X
కొన్ని కాంబినేషన్లు ట్రై చేయాలే కానీ.. ఆ కిక్కే వేరన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. మునక్కాయ చేసే మేలు అంతా ఇంతా కాదన్న విషయం తెలిసిందే. మునక్కాయను పలువురు సహజసిద్ధమైన వయగ్రాగా అభివర్ణిస్తుంటారు. దీనికి కారణం అందులో ఉండే ఐరన్..కాల్షియం.. విటమిన్లు ఎక్కువగా ఉండటమే. మునక్కాయలో ఉండే పోషకాలు లైంగిక శక్తిని పెంచటమే కాదు.. మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతుంటారు.

మునక్కాయతో టమోటాను కలిపితే ఆ రుచే వేరంటారు. దీనికి జీడిపప్పును జోడిస్తే మంచి ప్రయోజనం ఉంటుందన్న మాటను పోషహాకాహార నిపుణులు చెబుతున్నారు. మునక్కాయ కర్రీలో జీడిపప్పును కలిపి తీసుకుంటే రుచికి రుచి మాత్రమే కాదు.. పడకగదిలో లెక్కలు పూర్తిగా మారిపోతాయన్న మాట వినిపిస్తోంది.

మునక్కాయకు ఉండే ప్రత్యేకతతో పాటు.. జీడిపప్పు కారణంగా నరాలకు పటుత్వం కలుగుతుంది. లైంగిక శక్తిని బలోపేతం చేస్తుంది. దీంతో నరాల బలహీనత పోగొట్టుకోవటమే కాదు... గుండెకూ.. కిడ్నీలకు మంచిదని చెబుతున్నారు. జీడిపప్పుతో వృద్ధాప్య ఛాయల్ని కంట్రోల్ చేయొచ్చని చెబుతారు. సో.. మునక్కాయ కూరలో జీడిపప్పును దండిగా వేస్తే.. పడకగదిలో కొత్త ఉత్సాహంతో దూసుకుపోయే వీలుందని చెబుతున్నారు. మరిక ఆలస్యం ఎందుకు ట్రై చేసి చూడండి.