Begin typing your search above and press return to search.

హెల్త్ అప్డేట్ : తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   1 Feb 2023 2:09 PM GMT
హెల్త్ అప్డేట్ : తారకరత్న ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే?
X
బెంగళూరులోని నారాయణ హృదయాలయలో నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తాజాగా బులిటెన్ లో తారకరత్నకు మరికొన్ని పరీక్షలు అవసరమని.. వాటిని నిర్వహించిన తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో తారకరత్న తండ్రి మోహనకృష్ణ, భార్య అలేఖ్యరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులున్నారు.

కార్డియాలజిస్టులు, ప్రత్యేకవైద్య బృందం దగ్గరుండి మరీ తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేరినప్పుడు గడ్డంతో కనిపించిన తారకరత్న.. ప్రస్తుతం గడ్డం లేకుండా నీట్ షేవ్ తో కనిపిస్తున్నారు.తారకరత్న చాలా త్వరగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అటు తక్కువ ఆక్సిజన్ అందడంతో బ్రెయిన్ ఎఫెక్ట్ అయినట్లు సిటీ స్కాన్ రిపోర్టుతో డాక్టర్లు గుర్తించారు. దీంతో బ్రెయిన్ డ్యామేజ్ రికవరీపై వైద్య నిపుణులు ఫోకస్ పెట్టారు.

హెల్త్ అప్డేట్ ప్రకారం.. తారకరత్న ప్రస్తుతం వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. తారక రత్న ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. చికిత్స చేస్తున్న నిపుణుల బృందం అతని గుండె మరియు మూత్రపిండాలు మెరుగుపడుతున్నట్లు నివేదించింది.. తారక రత్నకు మల్టీ డిసిప్లినరీ వైద్య నిపుణుల నుంచి క్షుణ్ణంగా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్యుల ప్రకారం.. గుండె , మూత్రపిండాలు మెరుగ్గా పనిచేస్తోందని.. అతని మెదడు కూడా పనిచేయడం ప్రారంభిస్తే వైద్యులు వెంటిలేటర్ సపోర్టును తొలగిస్తారని అంటున్నారు. దీనికి ఉన్నత వైద్య నిపుణుల నుండి మరింత అంచనా అవసరమని అంటున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ మీడియాకు వివరించారు. నిన్నటితో పోల్చితే తారకరత్న కొద్దిగా కోలుకుంటున్నాడని వెల్లడించారు. డాక్టర్లు లైఫ్ సపోర్టు సిస్టమ్ మద్దతు కొద్దిగా తగ్గించారని.. మందుల వాడకం కూడా కొద్దిగా తగ్గించారని వివరించారు. గుండె, కాలేయం పనితీరు సాధారణ స్థితికి చేరుకున్నట్లు రామకృష్ణ తెలిపారు. అయితే న్యూరో విషయంలో కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వివరించారు. తారకరత్న తనకు తాను శ్వాస తీసుకుంటున్నారని తెలిపారు. ఇది తమకు చాలా సంతోషం కలిగించిందని అన్నారు.

ఇక తారకరత్న చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి బయటకు రావడంతో అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది సూచి నందమూరి అభిమానులు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

జనవరి 27న కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర యువగళం సందర్భంగా తారకరత్నకు గుండెపోటు వచ్చింది. వెంటనే కుప్పం ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. యాంజియోగ్రామ్‌లో గుండెకు ఎడమ వైపున 90% బ్లాకేజీ ఉందని ఇంతకు ముందు తేలింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నందున వైద్యులు ఆపరేట్ చేయలేకపోతున్నారు. ధమనిలో స్టెంట్లను అమర్చలేరు. తరకరత్నకు అంతర్గత రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం నారాయణ ఆస్పత్రి వైద్యుల పర్యవేక్షణలో తారకరత్న పరిస్థితి మెరుగవుతోంది. చికిత్స కొనసాగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.