Begin typing your search above and press return to search.

హెల్త్ టిప్: రోజూ ఇలా చేస్తే కరోనా ఖతం..!

By:  Tupaki Desk   |   16 April 2021 1:30 AM GMT
హెల్త్ టిప్: రోజూ ఇలా చేస్తే కరోనా ఖతం..!
X
కరోనా మహమ్మారి నానాటికీ విజృంభిస్తోంది. వైరస్ ను కట్టడి చేయడానికి ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇక కొవిడ్ రాకుండా ఉండేలా నిపుణులు కొన్ని సూచనలు చేశారు. ఆహారం విషయంలోనూ పలు సూచనలు ఇచ్చారు. కరోనాని ఎదుర్కొనేందుకు నిపుణులు మరికొన్ని పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో పలు అంశాలు వెల్లడించారు. వాటిని పాటిస్తే మహమ్మారి ఏం చేయలేదని అంటున్నారు.

రోజూ కాసేపు ఎండలో ఉంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కరోనా ముప్పు తక్కువగా ఉందని తెలిపారు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు కొవిడ్ రాకుండా కాపాడుతాయని వివరించారు.

సూర్యకాంతిలో 95శాతం వరకు అతినీలలోహిత కిరణాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి మానవ చర్మంలోకి చొచ్చుకుపోతాయని... ఫలితంగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వెల్లడించారు. శరీరంలోని కరోనా వైరస్ ను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. అందుకే మహమ్మారి ముప్పు ఎక్కువగా ఉండదని వివరించారు.

2020 జనవరి నుంచి దీనిపై పరిశోధనలు ప్రారంభించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం 2,474మందిపై ఈ అధ్యయనం జరిపినట్లు వెల్లడించారు. వారిలో యూపీ కిరణాల ప్రభావాన్ని గుర్తించారు. వివిధ దేశాల శాస్త్రవేత్తలూ సూర్యకాంతితో కరోనాను ఎదుర్కోగలమని చెప్పారు.

ఎండకు తిరిగేవారి కన్నా ఇంట్లో ఉండేవారిపై వైరస్ అధికంగా ప్రభావం చూపుతోందని గుర్తించారు. ఇక సూర్యరశ్మిలో విటమిన్ డి కూడా ఉంటుంది. అది కూడా మానవ శరీరానికి చాలా అవసరం. అందుకే రోజూ కాసేపు ఎండ వేడిమి తగిలితే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు.