Begin typing your search above and press return to search.

యశోదలో పరీక్షలు: కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందంటే?

By:  Tupaki Desk   |   21 April 2021 3:37 PM GMT
యశోదలో పరీక్షలు: కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందంటే?
X
కరోనా బారిన పడ్డ సీఎం కేసీఆర్ ఈరోజు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి సోమాజిగూడ లోని యశోద ఆస్పత్రికి వచ్చారు. కరోనాకు సంబంధించి 6 పరీక్షలను వైద్యులు కేసీఆర్ కు చేశారు. సిటీ స్కాన్ తోపాటు ఇతర పరీక్షలు పూర్తయ్యాయి.

ప్రభుత్వ, పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సీఎం కేసీఆర్ కరోనాను జయించినట్లు సమాచారం. వైరస్ లక్షణాలు ఏమీ లేవని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు.

సీఎం కేసీఆర్ కు సాధారణ పరీక్షలు చేశామని కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. అంతా సాధారణంగానే ఉందని తెలిపారు. కేసీఆర్ కు కోవిడ్ లక్షణాలు పోయాయని స్పష్టం చేశారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని.. త్వరలోనే ఆయన విధులకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉన్నాయని ఎంవీ రావు తెలిపారు.

ఈనెల 19న యాంటీజెన్ పరీక్షలు చేయించుకోగా కేసీఆర్ కు స్వల్ప కరోనా లక్షణాలున్నట్లు తేలింది. తర్వాత ఆర్టీపీసీఆర్ పరీక్ష సైతం నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా మేరకు వ్యవసాయక్షేత్రంలోనే హోం ఐసోలేషన్ లో ఉంటున్నారు. వైద్య బృందాలు పర్యవేక్షిస్తున్నాయి.

కాగా కేసీఆర్ యశోద ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నప్పుడు ఆయన వెంట కొడుకు, కూతురు అయినా మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సైతం యశోద ఆస్పత్రిలోనే ఉన్నారు. తండ్రికి ఆస్పత్రిలో ఉన్నంత సేపు ఆయన వెంట ఉండి పర్యవేక్షించారు. యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయారు.