Begin typing your search above and press return to search.

మద్యం తాగితే జరిగేదిదే.. హ్యాంగోవర్ తగ్గాలంటే?

By:  Tupaki Desk   |   14 Jan 2020 7:06 AM GMT
మద్యం తాగితే జరిగేదిదే.. హ్యాంగోవర్ తగ్గాలంటే?
X
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టును అన్నాడు నాటి గిరీషం. ఇప్పుడు మద్యం తాగని వాడు నిజంగా దున్నేపోతే అంటున్నారు ఆధునిక గిరీషంలు.. ఆడ మగా తేడా లేకుండా అందరూ మద్యంను తాగేస్తున్నారు. బీర్లు ఆడవాళ్లు కూడా నీళ్లు తాగినట్టు తాగుతున్నారు.

అయితే తాగినప్పుడు మనిషి ఎందుకలా ప్రవర్తిస్తాడు? అసలు శరీరంలో ఏమవుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలనే దానిపై యూనివర్సిటీ ఆఫ్ బ్రింగ్టన్ పరిశోధకులు పరిశోధించారు. ఆ వివరాలు ఆసక్తి రేపుతున్నాయి.

వీకెండ్ వస్తే చాలు కొంత మంది మద్యం సేవిస్తుంటారు. మందు మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుందట.. శరీరంలో ఉత్సాహం పెరుగుతుందట.. శరీరంలో అప్పుడు ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ హార్మోన్లు మెదడుకు తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి.

అయితే అతిగా మందు తాగితే మాత్రం మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయని పరిశోధనలో తేలింది. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుందట.. శ్వాస కూడా నెమ్మదిస్తుందట.. అది కొన్ని సార్లు మరణానికి దారితీస్తుందని పరిశోధనలో తేలింది.

మన శరీరంలో అల్యాహాల్ (మద్యం) మోతాదు పెరిగితే మొదట మాటల్లో తేడా.. నడకలో మార్పు.. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గి విచక్షణ కోల్పోతారని.. మెదడు క్రియాశీలత తగ్గుతుదని తేలింది. మద్యంను కాలేయం కరిగించే క్రమంలో విడుదలయ్యే శక్తి వల్ల అదనపు కొవ్వు చేరి బరువు పెరుగుతారు..మద్యం ఎఫెక్ట్ ను కరిగించే ప్రయత్నంలో కాలేయం - మూత్ర పిండాలు దెబ్బతింటాయి.

ఇక రాత్రి బాగా తాగి తెల్లవారి హ్యాంగోవర్ కు గురి అవుతుంటారు చాలా మంది. దానికి మందులు లేవు. మత్తు దిగేదాకా విరామం ఇవ్వడమే ఉత్తమ మార్గం అని పరిశోధకులు చెబుతున్నారు. నీళ్లు తాగితే హ్యాంగోవర్ తగ్గుతుంది. రక్తంలో నీరు తగ్గడం వల్ల తలనొప్పి వస్తుందని తేల్చారు.