Begin typing your search above and press return to search.
మధుమేహులకు చక్కటి చిట్కా..పసుపుతో అదుపులోకి
By: Tupaki Desk | 9 May 2020 7:00 AM ISTమధుమేహం (షుగర్, డయాబెటిస్) ఇది ఒక్కసారి వచ్చిందంటే చచ్చేదాక నయం కాని వ్యాధి. ఏది తిందామనుకున్నా తినలేని పరిస్థితి. నాలుకను చంపుకుని తినాల్సిన దుస్థితి. ఇలాంటి వారి బాధలు వర్ణనాతీతం. ఈ మధుమేహన్ని తగ్గించేందుకు చాలా మందులు ఉన్నాయి. అల్లోపతి తదితర మందులను వాడుతుంటారు. ఎన్ని మందులు వేసుకున్నా అదే పరిస్థితే. ఆ మధుమేహన్ని తగ్గించడం అనేది చేయదు. కేవలం తాత్కాలికంగా దాని ప్రభావం వాయిదా వేయడమే. ఈ విధంగా మధుమేహం ఉంటుంది. ఇక దీని ప్రభావంతో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ మధుమేహానికి పసుపుతో కూడా కొంత నియంత్రించవచ్చని తెలుస్తోంది. పసుపు పరమ ఔషధమని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ పసుపు మధుమేహం తగ్గించడానికి కొంత దోహదం చేస్తుంది. అదెలాగో చదవండి.
పసుపులో కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే పసుపును మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మనం తినే ఆహారంలో తప్పనిసరిగా పసుపు ఏదో రూపంలో ఉంటే కొంత మధుమేహం అదుపులో ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పసుపుతో బ్లడ్ షుగర్ స్థాయి నియంత్రణ లో ఉంటుందని పేర్కొంటున్నారు. పసుపులో ఉండే కర్క్యూమిన్ మన శరీరంలోని కొవ్వు నిల్వలు తగ్గించేలా చేస్తుంది. దీంతో రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గే అవకాశం ఉంది. రక్త ప్రసారం సులువుగా అవుతుంది. దీంతో మధుమేహం తగ్గేందుకు దోహదం చేస్తుంది.
పసుపుని పలు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో పసుపుని కలపి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు షుగర్ లెవల్స్ తగ్గుతాయి. నిద్రపోయే సమయంలో పాలల్లో పసుపు వేసుకుని తాగొచ్చు. రోగ నిరోధక శక్తి పెరగడానికి పసుపు కూడా దోహదం చేస్తుంది.