Begin typing your search above and press return to search.

రాసి పెట్టుకోండి.. ఆయన సీఎం కాలేడు: రాహుల్

By:  Tupaki Desk   |   8 March 2021 9:02 PM IST
రాసి పెట్టుకోండి.. ఆయన సీఎం కాలేడు: రాహుల్
X
మధ్యప్రదేశ్ రాజకీయాలపై రాహుల్ గాంధీ సంచలన ప్రకటన చేశారు. జ్యోతిరాధిత్య సింధియా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం.. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలను తాజాగా చేశారు.కాంగ్రెస్ లో జ్యోతిరాధిత్య సింధియా ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవారని.. ఇప్పుడు ఆయన జన్మలో సీఎం కాలేడని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరి.. బ్యాక్ బెంచర్ గా మారిపోయారని రాహుల్ ఎద్దేవా చేశారు.తాజాగా కాంగ్రెస్ యువజన విభాగం నేతలతో రాహుల్ గాంధీ సోమవారం భేటి అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ లోనే ఉంటే సింధియా ముఖ్యమంత్రి అయ్యేవారని.. ఇప్పుడు బీజేపీలో చేరిపోయి బ్యాక్ బెంజర్ గా మారిపోయాడని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ లో ఉంటే ఏదో ఒకరోజు సీఎం అయ్యేవారని.. నేను సింధియాతో అప్పట్లోనే ఈ విషయం చెప్పానని రాహుల్ అన్నారు.

కానీ జ్యోతిరాధిత్య నా మాట వినకుండా వేరే మార్గాన్ని ఎంచుకున్నారని రాహుల్ విమర్శించాడు. రాసిపెట్టుకోండి.. ఆయనెప్పుడూ సీఎం కాలేరని రాహుల్ స్పష్టం చేశారు. సీఎం కావాలంటే తిరిగి కాంగ్రెస్ లో చేరితేనే సాధ్యమవుతుందని రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.