Begin typing your search above and press return to search.

భార్య‌కి విడాకులిచ్చి ర‌ష్యా పై యుద్దానికి హీరో!

By:  Tupaki Desk   |   26 April 2022 2:30 AM GMT
భార్య‌కి విడాకులిచ్చి ర‌ష్యా పై యుద్దానికి హీరో!
X
క‌రోనాకి ముదిరిన స‌మ‌యంలో పెళ్లి చేసుకున్నారు. కరోనా త‌గ్గిన త‌ర్వాత విడిపోయారు. అవును ఇది నిజ‌మే. ఓ సెల‌బ్రిటీ ప్రేమ జంట నిర్వాకం. ఇంత‌కీ ఆ దంప‌తులు ఎవ‌రు? ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది? అంత‌గా విడిపోవాల్సిన తీవ్ర విబేధాలు ఏంటి? అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

60 ఏళ్ల సీన్ పెన్-30 ఏళ్ల లెయ్ లా జార్స్ హాలీవుడ్ జంట 2016 నుంచి ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక‌టి కావాల‌నుకున్నారు. ఈ నేప‌థ్యంలో విదేశాల్లో క‌రోనా స‌మ‌యంలో 2020లో వివాహం చేసుకున్నారు.

ప్ర‌పంచం లాక్ డౌన్ లో ఉన్నా ఈ జంట వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. ఈ విష‌యాన్ని సీన్ పెళ్లైన నెల రోజుల త‌ర్వాత అధికారికంగా వెల్ల‌డించారు. క‌రోనా కార‌ణంగా అతిధుల్ని ఎవ‌ర్నీ ఆహ్వానించ‌లేక‌పోయామ‌ని..జూమ్ యాప్ ద్వారా అందుబాటులోకి వ‌చ్చిన సంబంధిత అధికారి త‌మ కోవిడ్ వెడ్డింగ్ ని ఆన్ లైన్ లోనే జరిపించినట్లు తెలిపారు. కానీ నాలుగేళ్ల ప్ర‌యాణం అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు త‌లెత్తాయని విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

కార‌ణాలు ఏంటి అన్న‌ది తెలియ‌దు గానీ కొన్ని రోజులుగా పెన్ యుద్దంతో అత‌లాకుత‌ల‌మైన ఉక్రెయిన్ లో ఉంటున్నాడు. దానిపై ఓ డాక్యుమెంట‌రీ కూడా రూపొందించారు. అనంత‌రం అమెరికాకి తిరిగి వ‌చ్చి భార్య‌కి విష‌యం చెప్పి..మ‌ళ్లీ ఉక్రెయిన్ తిరిగి వెళ్తాన‌ని అంటున్నారు. పెన్ వ్య‌వ‌హారం చూస్తుంటే భార్య‌కి ఇష్టం లేకున్నా త‌న ఇష్ట ప్ర‌కార‌మే విడాకులు తీసుకోవ‌డ‌నికి రెడీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఉక్ర‌యిన్ మ‌ద్ద‌తుగా ర‌ష్యాపై యుద్దం చేయ‌డానికే ఇలాంటిల నిర్ణ‌యం తీసుకున్నాడా? అంటూ కొంత‌మంది సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. ర‌ష్యా దాడితో ఉక్రెయిన్ ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోయిందో తెలిసిందే. ప్ర‌పంచ దేశాలు ఉక్రెయిన్ కి మాట సాయం అందిస్తున్నాయ్ త‌ప్ప చేత‌ల రూపంలో మ‌రో దేశం మ‌ద్దుతుగా వార్ లో కి దిగలేదు.

ఇలాంటి స‌న్నివేశాలు చ‌సి పెన్ మ‌రింత చ‌లించిపోయారో ! ఏమా! ఉక్రెయిన్ కి నేను ఉన్నానంటూ మాన‌వ‌తా దృక్ఫ‌ధంతో ముందుకు రావ‌డం. అయితే ఈవిష‌యంపై లెయ్ లా జార్స్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. మ‌రి ఆమె రియాక్ష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి.