Begin typing your search above and press return to search.
సజీవంగా అతడిని ఫ్రెండ్స్ సమాధి చేశారు .. 50 గంటలు తర్వాత
By: Tupaki Desk | 4 April 2021 5:00 AM ISTసజీవ సమాధి అనగానే అందరికి దాదాపుగా శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మంగారు గుర్తుకు వస్తారు. అయన సజీవంగానే సమాధి అయ్యారు. ఇప్పటికి కూడా అయన ఆ సమాధిలో బ్రతికే ఉన్నారు అని చాలామంది విశ్వసిస్తారు. ఐతే , సజీవ సమాధి అనేది బ్రతికుండగానే ఆ నరకాన్ని చూడటమే. ప్రత్యక్ష నరకం. అందుకే, ఓ యూట్యూబర్.. సజీవంగా సమాధి కావాలని నిర్ణయించుకున్నాడు. సుమారు 50 గంటలు సమాధిలో గడిపి అరుదైన సాహసం చేశాడు. ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతుంది.ఇంతకీ ఈ క్రేజీ ఐడియా వచ్చింది ఎవరికంటే .. జిమ్మీ డోనాల్డ్ సన్.
యూట్యూబ్ లో ‘MrBeast’గా సుపరిచితుడైన జిమ్మీ.. రకరకాల స్టంట్లు ప్రదర్శిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు ఓ వీడియో పోస్ట్ చేశాడంటే చాలు మినిమం 30 మిలియన్ కు మించి వ్యూస్ రావాల్సిందే. కొన్ని వీడియోలైతే 100 మిలియన్ కూడా దాటేశాయి. యూట్యూబ్ తో వచ్చిన ఆదాయంతో అతడు అమెరికాలోని దాదాపు అన్ని నగరాల్లో ‘మిస్టర్ బీస్ట్ బర్గర్స్’ పేరుతో రెస్టారెంట్లు కూడా ప్రారంభించాడు. ఇక తాజాగా అతడు సమాధిలో సుమారు 50 గంటలు గడిపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో ఇప్పటికే 56 మిలియన్లు దాటింది. జిమ్మీ తన స్నేహితుల సాయంతో ఎనిమిది అడుగుల గొయ్యి తవ్వించాడు. ఆ తర్వాత ప్రత్యేకంగా తయారు చేయించుకున్న అద్దాల శవపేటికలో జిమ్మీ పడుకున్నాడు. సమాధిలో ఉన్న అతడిని చూసేందుకు వీలుగా శవపేటికలో కెమేరాలు కూడా పెట్టారు. 50 గంటలు సమాధిలో గడిపేందుకు కావాల్సిన వస్తువులు తీసుకోని సమాధిలోకి వెళ్లి పడుకున్నాడు.
ఆ తర్వాత అతడి సమాధి మీద స్నేహితులు ఇద్దరు రచ్చ రచ్చ చేశారు. శవపేటికలో ఉన్న జిమ్మీకి ఊపిరి ఆడేందుకు వీలుగా ఏసీని ఫిట్ చేశారు. అయితే, సమాధిలో 24 గంటలు గడిచిన తర్వాత జిమ్మీ అందులో నిద్రపోవడానికి ఇబ్బందిపడ్డాడు. 50 గంటలు పూర్తయ్యేసరికి శవపేటికలో ఉండటం అతడికి కష్టంగా మారింది. దుర్వాసన కూడా పెరిగిందని జిమ్మీ చెప్పాడు. ఎట్టకేలకు లక్ష్యాన్ని పూర్తిచేసిన జీమ్మీని తన స్నేహితులు శవ పేటిక నుంచి బయటకు తీశారు. అయితే, శవపేటికలో కదలకుండా 50 గంటలు ఉండటమంటే మాటలు కాదు. ఆయనెవరో ఉన్నారు కదా అని ఎవరైనా కూడా ఈ డేంజరస్ స్టంట్ ట్రై చేయకండి. ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు.