Begin typing your search above and press return to search.

కేంద్రంతో పోరుకు రెడీ అంటున్న ముందుకొచ్చారు

By:  Tupaki Desk   |   7 Feb 2021 9:30 AM IST
కేంద్రంతో పోరుకు రెడీ అంటున్న ముందుకొచ్చారు
X
ఆంధ్రుల హక్కుపై మొదలైన రగడ అంతకంతకూ ముదురుతోంది. ఈ అంశంపై సాగుతున్న పరిణామాలు ఏపీ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేస్తే.. విశాఖ ఎంపీ సైతం రాజీనామాకు సిద్ధమంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై కేంద్రంపై పోరుకు తాము సిద్ధమని ఏపీ ఎన్జీవోల సంఘం మద్దతు ప్రకటించింది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొన్న సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి.. నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయటం బాధాకరమన్నారు. కేంద్రంపై పోరుకు పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా.. రాజకీయాలకు అతీతంగా అందరూ రాజీనామా చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని విన్నవించారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలని.. ముఖ్యమంత్రి జగన్.. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీని కలవాలన్న డిమాండ్ చేస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. మరీ.. సలహాపై సీఎం జగన్ స్పందన ఏమిటో..?