Begin typing your search above and press return to search.
అమ్మాయిని రేప్ చేసి అమ్మేశాడు.. 25ఏళ్లుగా తప్పించుకుంటున్నాడు.. ఇవాళ శిక్ష పడింది!
By: Tupaki Desk | 13 Feb 2021 8:00 AM ISTకేరళలో రాష్ట్రం.. కోల్లాం జిల్లా కందక్కల్ ప్రాంతానికి చెందిన సురేష్ అలియాస్ షాజహాన్ (51) ఎంతటి కామాంధుడో.. అంతకు మించి ఎంతటి దుర్మార్గుడో వివరించే కథనం ఇది! 1995లో అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక ఉద్యోగం కోసం అతడిని కలిసింది. అలా వెళ్లడమే.. ఆమె జీవితాన్ని దారుణమైన పరిస్థితుల్లోకి నెడుతుందన్న సంగతి గుర్తించలేకపోయింది పాపం!
ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పిన సురేష్.. ఆ బాలికను కిడ్నాప్ చేసి పలు చోట్ల తిప్పుతూ పదేపదే అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా జాలి చూపకుండా.. వేశ్యా గృహం నిర్వహించే అజితా బేగం అనే మహిళకు అమ్మేశాడు. దీంతో.. ఆ బాలిక జీవితం ఆగమాగమైంది.
1996 జూన్ లో ఈ విషయం బయటకు రావడంతో.. దేశవ్యాప్తంగా సంచలనం కలిగింది. ఎట్టకేలకు పోలీసులు సురేష్ ను అరెస్టు చేశారు. దాదాపు 14 నెలలు జైల్లో ఉన్న సురేష్.. బెయిల్ పై బయటకు వచ్చి, తప్పించుకు తిరగడం మొదలు పెట్టాడు. దాదాపు 19 ఏళ్ల పాటు పోలీసుల కళ్లు గప్పిన సురేష్.. హైదరాబాద్ లోనే మకాం వేశాడు. 2019 జూన్ లో ఆ నిందితున్ని పోలీసులు పట్టుకున్నారు.
విచారణ పూర్తిచేసిన కేరళ కోర్టు.. సురేష్ ను దోషిగా నిర్ధారించింది. చేసిన నేరానికి శిక్షగా 24 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే.. ఇదే కేసులో అభియోగం ఎదుర్కొన్న మలయాళం సినీ నటుడు జగతి శ్రీకుమార్ తోపాటు మరికొందరు నిర్దోషులుగా విడుదలయ్యారు.