Begin typing your search above and press return to search.
సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి రాజకీయ వారసుడు అతడేనట
By: Tupaki Desk | 11 Nov 2020 9:45 AM ISTసుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న టీడీపీ నేతల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒకరు. వయసుతో సంబంధం లేకుండా.. కుర్రాడి మాదిరి కస్సుమంటూ ప్రత్యర్థులపై కోపాన్ని ప్రదర్శించే ఆయన తీరు అందరిని ఆకర్షిస్తుంటుంది. అయితే.. ఆయన మాటల్లోనూ.. ఆగ్రహంలోనూ లాజిక్ తక్కువ.. రచ్చ ఎక్కువన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.
అలాంటి ఆయన తాజాగా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో.. తనకు సంబంధించి కొన్ని షాకింగ్ అంశాల్ని చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లో నిజాయితీగా ఉన్నానని.. అందుకే ఆస్తులు కూడా పోగొట్టుకున్నట్లుగా వెల్లడించారు. రాజమహేంద్రవరంలో పార్టీని కొందరు తమ కుటుంబ ఆస్తిగా భావిస్తారని.. కార్యకర్తల్ని హింసిస్తున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు.
తన వద్దకు వచ్చినా.. తన ఫ్లెక్సీ పెట్టినా ఊరుకోవటం లేదన్నారు. తనను.. తన సీనియార్టీని అవమానపరుస్తున్నారంటూ ఆవేశానికి గురైన ఆయన.. ఇకనుంచి తన తమ్ముడు కొడుకు రవిరామ్ కిరణ్ ను తన రాజకీయ వారసుడిగా ఆయన ప్రకటించారు. గ్రేటర్ రాజమహేంద్రవరంలో ఆయన రాజకీయాలు మొదలు పెడతారని చెప్పారు. ఇప్పటికే డాక్టర్ సెల్ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నట్లు చెప్పారు.
వాస్తవానికి బుచ్చయ్య చౌదరి గత ఎన్నికల సమయంలోనే ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ తీరుపై తనకున్న గుర్రును తన మాటలతో చెప్పేశారు. భవిష్యత్తు అంతా యువతదేనని.. సీనియర్లు తప్పుకొని యువతకు అవకాశం ఇవ్వాలన్నారు. అలాంటి ఆయన.. తన రాజకీయ వారసుడ్ని ప్రకటించటంతో పాటు.. పార్టీపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.