Begin typing your search above and press return to search.

సీమలో బీజేపీకి ఈ రెడ్డప్పే దిక్కా?

By:  Tupaki Desk   |   23 Aug 2019 1:30 AM GMT
సీమలో బీజేపీకి ఈ రెడ్డప్పే దిక్కా?
X
ఏపీ వ్యాప్తంగా బలపడాలని యోచిస్తున్న బీజేపీకి ఇప్పుడు రాయలసీమ కొరకరాని కొయ్యగా మారిందట.. జేసీ బ్రదర్స్- భూమా ఫ్యామిలీ- పరిటాల ఫ్యామిలీ బీజేపీలోకి వస్తామంటూ ఆశచూపి ఇప్పుడు టీడీపీని వీడకపోవడంతో సీమపై ఆందోళనగా ఉందట బీజేపీ.. చేయిచ్చిన వారికి ప్రత్యామ్మాయ నేత కోసం బీజేపీ శూలశోధన మొదలుపెట్టిందట..

ఉత్తరాంధ్ర- గోదావరి జిల్లాలు- గుంటూరు కృష్ణా- నెల్లూరు వరకూ ఎవరో ఒకరు గట్టి లీడర్ బీజేపీకి ఉన్నారు. కానీ సీమకు వచ్చేసరికి మాత్రం బలమైన నేత మాత్రం కనిపించడం లేదట.. చేరుదామనుకున్న వారు చేరకపోవడంతో ఇప్పుడు పార్టీకి బలమైన వ్యక్తి కోసం బీజేపీ వెతుకుతోందట..

తాజాగా కడప జిల్లా కు చెందిన మాజీ మంత్రి- టీడీపీ సీనియర్ నేత ఆది నారాయణ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చలు జరపడంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమేనన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. వైసీపీ తరుఫున 2014లో గెలిచిన ఆయనను కడపలో టీడీపీ తరుఫున ఎవ్వరూ గెలవకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆపరేషన్ ఆకర్ష్ తో లాగేసి ఏకంగా మంత్రిపదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయన బాబుకు హ్యాండిచ్చి బీజేపీలో చేరుతుండడం నమ్మకద్రోహం అంటూ కడప టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.

ఇక ఆదినారాయణ రెడ్డి తను వెళ్లడమే కాదు.. బీజేపీ భారీ ఆఫర్ కు బద్వేలు- ప్రొద్దుటూరు- రాజంపేట నియోజకవర్గాల్లోని తన అనుయాయులు- నేతలను తన వెంట తీసుకెళ్లి బీజేపీలోకి వెళుతుండడం టీడీపీని షాక్ కు గురిచేస్తోందట.. అయితే ఆది చేరికతో బీజేపీకి సీమలో ఓ బలమైన నేత దొరికినట్టైందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.