Begin typing your search above and press return to search.

తాజా గాలి.. సీసా 2 వేలే

By:  Tupaki Desk   |   10 Jan 2016 2:19 PM IST
తాజా గాలి.. సీసా 2 వేలే
X
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎంతగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. అందుకే అక్కడ కాలుష్యం తగ్గించడానికి గాను వాహనాల నియంత్రణకు సరి-బేసి నంబర్ ప్లేట్ల విధానాన్ని తీసుకొచ్చారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత... ప్రజలు పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి కరవైందన్న విషయాన్ని ప్రజలకు అర్తమయ్యేలా వివరించడానికి, ఆ తీవ్రత అందరికీ చేరాలన్న ఉద్దేశంతో కొందరు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఇద్దరు ఢిల్లీ వీధుల్లో గాలి సీసాలు అమ్ముతూ అందరినీ కొనమని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు యూట్యూబ్ - సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది. ''హవా బదలా'' పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్ లో ఉన్న ఈ వీడియో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

''రండి బాబూ రండి... పెద్ద సీసా రెండు వేలు.. చిన్న సీసా వెయ్యి రూపాయలే.. స్వచ్ఛమైన గాలి..'' అంటూ ఇద్దరు యువతీయువకులు దారిన పోయేవారందరికీ రెండు ఎయిర్ క్యాన్లు చూపించి విక్రయించే ప్రయత్నం చేయడం... కొందరు వాటి గురించి తెలుసుకోవాలనుకోవడం.. ఇంకొందరు కాలుష్యత తీవ్రతపై వారితో చర్చించడం వంటి దృశ్యాలతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇప్పటికే పొరుగుదేశం చైనాలో గాలిని విక్రయిస్తున్న నేపథ్యంలో మనదేశంలో ఆ పరిస్థితులు వచ్చే ప్రమాదముందున్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మొత్తానికి హవా బదలా వీడియో ఇప్పుడు దేశాన్ని ఆలోచింపజేస్తోంది.

ఆ వీడియో చూడాలంటే..