Begin typing your search above and press return to search.

మోడీ గెలుపుపై పీకే విశ్లేషణ విన్నారా?

By:  Tupaki Desk   |   12 March 2022 8:37 AM GMT
మోడీ గెలుపుపై పీకే విశ్లేషణ విన్నారా?
X
అందరూ ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావటం.. అందులో నాలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకోవటం తెలిసిందే. ఈ ఘన విజయంతో కమలనాథులు మాంచి ఊపు మీద ఉన్నారు. ఇలాంటివేళ.. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నోటినుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ఆయన తక్కువ చేసేలా మాట్లాడటం గమనార్హం.

ప్రధానమంత్రి మోడీ గారడితోనే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిందన్న ఆయన.. మోడీ కనికట్టు గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాజా ఫలితాలతో నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని.. దేశంలో అధికారాన్ని నిర్ణయించే ఎన్నికలు 2024లో జరుగుతున్నాయని.. ఇప్పుడు వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండదన్నారు.

రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేంద్రంలో అధికారం చేతికి రాదన్న విషయం ప్రధాని మోడీకి కూడా తెలుసని.. తాజా ఫలితాలతో మైండ్ గేమ్ ఆడే అవకాశం ఉందని.. ఆ గారడీలో పడొద్దని.. తప్పుడు కథనంలో భాగం కావొద్దని కోరటం గమానర్హం. దీనికి సంబంధించిన ట్వీట్ ఒఖటి ఆయన చేశారు.

2014లో ఇదే మోడీ కేంద్రంలో పాగా వేయటంతో పీకే కీలక భూమిక పోషించారు. సరిగ్గా పదేళ్లకు దగ్గరవుతున్న వేళ.. అదే మోడీని ఓడించటమే పనిగా పెట్టుకున్నారు పీకే. ఇప్పటికే ఏపీలో వైసీపీ.. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీలతో పాటు తమిళనాడులో డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

పీకే చెప్పినట్లే.. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదన్న మాటలో నిజం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. ఆయన అనుకుంటున్నట్లుగా జాతీయస్థాయిలో ప్రధాని మోడీ మీద రావాల్సిన వ్యతిరేకత రాలేదన్నది మర్చిపోకూడదు.

అయితే.. ఈ ఏడాది చివర్లో.. వచ్చే ఏడాదిలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే తీర్పు ప్రభావం మాత్రం తప్పక ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు. అప్పటివరకు పీకేనే కాదు.. మిగిలిన వారి అంచనాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు.