Begin typing your search above and press return to search.
ఫుల్ గా తాగేసే అలవాటు ఉందా.. సైంటిస్టుల తాజా వార్నింగ్ విన్నారా?
By: Tupaki Desk | 15 Feb 2021 5:00 PM ISTఫుల్ గా తాగేస్తుంటారు. అయితే..ఇకపై ఆ అలవాటును మార్చుకోవాల్సిందే. స్వయంగా తాగేవారు.. అలాంటి అలవాటు ఉన్న సన్నిహితులు.. పరిచయస్తులను హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే.. ఫుల్ గా తాగేసే పురుషుల్లో కొత్త ముప్పును శాస్త్రవేత్తలు గుర్తించారు. బెంగళూరులోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో కొత్త విషయాల్ని గుర్తించారు.
మితిమీరిన మద్యపానం వల్ల తొలుత అత్కాహల్ యూజ్ డిజార్డర్ తలెత్తుతుందని.. ఈ రుగ్మత బారిన పడిన పురుషుల్లో డీఎన్ఏ మార్పులు జరిగినట్లుగా వెల్లడించారు. మద్యం మోతాదు తగ్గించుకున్న.. పూర్తిగా మానేసిన సందర్భాల్లోనూ ఏయూడీతో వచ్చిన మార్పులుకనీసం మూడు నెలల పాటు కొనసాగినట్లుగా వెల్లడైనట్లు వారు చెబుతున్నారు.
21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న పురుషులపై తాము ప్రయోగాలు జరపగా.. ఈ కొత్త విషయాన్ని గుర్తించినట్లు వారు చెప్పారు. ఏయూడీతో రుగ్మత కారణంగా డీఎన్ఏలో మిథైల్ గ్రూప్స్ వచ్చి చేరుతాయని.. అవి డీఎన్ఏలో మార్పులు కలిగిస్తాయన్నారు. అయితే.. ఇవేమీ జన్యుక్రమాన్ని మార్చవని స్పష్టం చేశారు.
ఏయూడీ కారణంగా ప్రతి ఏడాది 30 లక్షల మంది చనిపోతున్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 15 -54 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 29 శాతం మంది మద్యాన్ని సేవిస్తారన్నది ఒక అంచనా. వారిలో 12 శాతం మంది రోజూ తాగితే.. 41 శాతం మంది మాత్రం వారానికి ఒకసారి తాగుతారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మందుతాగే వారంతా ఈ కొత్త విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.