Begin typing your search above and press return to search.

హత్రాస్ బాధితురాలిపై ‘అత్యాచారం’ జరగలేదట?

By:  Tupaki Desk   |   2 Oct 2020 11:30 AM IST
హత్రాస్ బాధితురాలిపై  ‘అత్యాచారం’ జరగలేదట?
X
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో 20 సంవత్సరాల దళిత యువతి మీద అత్యంత దారుణంగా హత్యాచారం జరిగిన సంఘటన దేశాన్ని కుదిపేసింది. వారిని శిక్షించాలంటూ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న వేళ యుపి లా అండ్ ఆర్డర్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ కీలక ప్రకటన చేయడం పుండు మీద కారం చల్లినట్టైంది. ఈ కేసులో ఇదో కొత్త పెద్ద మలుపుగా మారింది. ఫోరెన్సిక్ నివేదిక, పోస్టుమార్టం నివేదికను పోలీసులు బయటపెట్టారు. ఈ క్రమంలోనే ‘యువతి మీద అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టులో వచ్చిందని’ ఏడీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు.

బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు పెద్ద ఎత్తున నడుస్తున్న వేళ.., యువతిపై అత్యాచారం జరగలేదని యుపి పోలీసుల ప్రకటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ ప్రకటన ప్రకారం, ‘‘యువతి శరీరంలో పురుషుల వీర్యకణాల ఆనవాళ్లు లేవు, అత్యాచారం జరిగినట్లు బాధితురాలు తన ప్రకటనలో ఫిర్యాదు చేయలేదు. మెడకు గాయం కావడంతో దళిత మహిళ మరణించినట్లు’ ఫోరెన్సిక్ నివేదిక తేల్చింది. చున్నీతో మెడకు గట్టిగా ఉరిబిగించడం వల్ల రక్తస్రావమై ఆమె మరణించిందని రిపోర్టులో తేలిందని వివరించారు.

ఈ సమస్యను మత వ్యతిరేక, కుల సంఘర్షణలను రేకెత్తించడానికి కొన్ని సామాజిక వ్యతిరేక శక్తులు వాస్తవాల నుండి దృష్టి మరలిస్తున్నాయని యుపి ఏడీజీ ఆరోపించారు.

అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు, బాధితుల కుటుంబాన్ని ఓదార్చడానికి మరియు బాధితుడికి న్యాయం చేయాలని వారిద్దరూ హత్రాస్ కు రాగా వారిని అరెస్ట్ చేశఆరు.

మరోవైపు హత్రాస్ సంఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్ర అసంతృప్తి.. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటనపై మరియు కుటుంబం లేకుండా మరియు రాత్రిపూట దహన సంస్కారాలు ఎందుకు చేయవలసి వచ్చిందనే దానిపై ఎన్‌హెచ్‌ఆర్‌సి యుపి ప్రభుత్వానికి, యుపి డిజిపికి నోటీసులు జారీ చేసింది. మహిళా కమిషన్ కూడా వారి నుండి నాలుగు వారాల్లో వివరణ కోరింది.

* వీడియో: హత్రాస్ బాధితురాలి తండ్రికి బెదిరింపులు
హత్రాస్ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేళ హత్రాస్ బాధితురాలి తండ్రిని బెదిరిస్తూ మభ్యపెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హత్రస్ జిల్లా మేజిస్ట్రేట్ బాధితురాలి తండ్రిని బెదిరింపులకు గురిచేస్తూ స్టేట్మెంట్ మార్చాలని ఒత్తిడి తెచ్చినట్టు వీడియోలో ఉంది..

హత్రాస్ డిఎం ప్రవీణ్ లక్ష్కర్ 19 ఏళ్ల దళిత అమ్మాయి తండ్రికి నచ్చజెబుతూ బెదిరిస్తున్నట్టు వీడియోలో ఉంది. ‘ మీడియా అంతా ఈ రెండు మూడు రోజులు హడావుడి చేస్తుంది. ఆ తర్వాత వారు మిమ్మల్ని పట్టించుకోరు. మేము మాత్రమే మీతో నిలబడతాము. అందుకే మీరు మీ ఫిర్యాదును, స్టేట్ మెంట్ ను మార్చాలనుకుంటున్నారా లేదా అనేది మీ ఇష్టం ’ అంటూ వారిని కోరడం వీడియోలో కనిపించింది.