Begin typing your search above and press return to search.

హాథ్రస్ భాదిత‌ కుటుంబానికి మూడంచెల భారీ భద్రత !

By:  Tupaki Desk   |   15 Oct 2020 1:00 PM IST
హాథ్రస్ భాదిత‌ కుటుంబానికి మూడంచెల  భారీ భద్రత !
X
హాథ్రస్‌ బాధిత యువతి కుటుంబ సభ్యులకు, సాక్షులకు మూడంచెల భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు బుధవారం తెలిపింది. అలాగే , హాథ్రస్‌ బాధితురాలిపై జరిగిన సామూహిక అత్యాచారంపై సీబీఐ నిర్దిష్ట కాల పరిమితితో విచారణ నిర్వహించేలా, ప్రతి 15 రోజులకు ఒకసారి విచారణ జరుగుతున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని యూపీ సర్కార్ కోరింది.

ఆ నివేదికను ఉత్తర ప్రదేశ్‌ డీజీపీ సుప్రీంకోర్టుకి సమర్పిస్తారని ప్రభుత్వం తెలిపింది. అలాగే , హత్రాస్ బాధిత యువతి ఇంటి చుట్టూ 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, కుటుంబ సభ్యులకు, సాక్షులకు 16 మంది పోలీసులతో రక్షణ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్తగా క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు యోగి ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, సాక్షుల వ్యక్తిగత గోప్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోబోమని, ఈ విషయంపై అక్కడ కాపలాగా ఉన్న పోలీసులను కూడా ఆదేశించామని తెలిపింది. వారు స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లవచ్చునని, ఎలాంటి ఆటంకాలను కల్పించబోమని సుప్రీంకోర్టుకు సమర్పించిన, తమకు నచ్చిన వ్యక్తులను కలవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి బాధిత కుటుంబానికి, సాక్షులకు అనుమతిచ్చినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకి సమర్పించిన అఫిడవిట్‌ లో పొందుపరిచింది.