Begin typing your search above and press return to search.

హథీరాంజీ మఠం ఆభరణాల్లో గోల్ మాల్ !

By:  Tupaki Desk   |   11 July 2020 2:30 AM GMT
హథీరాంజీ మఠం ఆభరణాల్లో  గోల్ మాల్ !
X
ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల హథీరాంజీ మఠంలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. ఆశ్రమంలో ఉన్నటువంటి ఆభరణాలకు సరైన రక్షణ కూడా లేకుండా పోతుంది. ఆశ్రమంలో కనిపించకుండా పోయిన బంగారు నగలు , వెండి ఏమైంది అంటే .. దానికి కారణం నువ్వు అంటే నువ్వు అని అక్కడి సిబ్బంది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా అకౌంటెంట్ బీరువాలోని నగల లెక్కల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో కూడా ఈ హథీరాంజీ మఠం ఆభరణాల్లో గోల్ మాల్ జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ ప్రముఖ హథీరాంజీ మఠంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న గుర్రప్ప ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. దీనితో మఠం అధికారులు అందరి సమక్షంలో బీరువా తెరచి లెక్కలు పరిశీలించారు. అయితే , అందులో 108 గ్రాముల బంగారు డాలర్, వెండి వస్తువులు మాయమయ్యాయని వెల్లడించారు. ఇప్పుడు ఆ మాయమైన వస్తువులకు మఠం సిబ్బందిలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. చాలా విలువైన వస్తువులు మాయం కావడంతో ఈ విషయం పై మఠం అధికారులు సీరియస్ గా ఉన్నారు. మరోవైపు మఠంలో మిస్ అయిన వస్తువుల తాలుకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.