Begin typing your search above and press return to search.
‘బాబా కా దాబా’ నా మజాకా..! ట్విట్టర్ దెబ్బకు పెద్దాయన స్టార్ తిరిగింది..
By: Tupaki Desk | 9 Oct 2020 9:45 AM ISTఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. అలాగే ఒక్క హ్యాష్‌ట్యాగ్ నష్టాల్లో ఉన్న హోటల్ స్టార్‌ను తిప్పేసింది. మూత పడింది.. ఇక ఉపాధి ఎలా అని ఆలోచిస్తున్న వృద్ధదంపతులకు కాసులు కురిపించింది. రెండురోజులుగా ట్విట్టర్ లో #Babakadhaba పేరుతో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు ఈ దాబా ఎక్కడుంది. దాని కథ ఏమిటో తెలుసుకుందాం. ఢిల్లీలోని మాలవ్య నగర్ లో ఓ వృద్ధ జంట హోటల్ ను నడిపిస్తున్నది. వారిద్దరికీ 80 ఏళ్ల పైనే వయసు ఉంటుంది. ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హోటల్ నిర్వహిస్తూ వాళ్లు ఉపాధి పొందేవారు. అయితే కరోనా ఎఫెక్ట్ వారి జీవితాన్ని తలకిందులు చేసింది. లాక్ డౌన్ నిబంధనలు సడలించాక హోటల్ తెరిచారు. అయినా గిరాకీ మాత్రం లేదు. దీంతో ఈ పెద్దాయన ఆవేదనను ఓ యువకుడు తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. ప్రముఖ నటి సోనమ్ కపూర్ కూడా ఈ వీడియో ను తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసింది.
దీంతో ఒక్క రోజులోనే వీడియో వైరల్ గా మారింది. బాబాకా దాబా పేరు తో ట్విట్టర్ ఖాతాలు హోరేత్తాయి. ఢిల్లీకి చెందిన వారంతా ఆ హోటల్ కు పరుగులు పెట్టారు. కొందరు వ్యక్తిగతంగా ఆ వృద్ధదంపతులకు సాయం చేసి మానవత్వం చాటుకుంటే.. మరికొందరమే అక్కడ భోజనం చేసి వచ్చారు. ఇలా ఆ హోటల్ కు ప్రజలు క్యూ కట్టారు. వారికి వండి పెట్టాలంటే తాము 10 మందిని పెట్టుకోవాలని ఇప్పుడు ఆ వృద్ధ దంపతులు చెబుతున్నారు. అంతేకాక తమ వీడియో ను పోస్ట్ చేసిన వాళ్లకు, ట్విట్టర్ కు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. సోషల్ మీడియా పవరంటే ఇదే మరి. అవసరం అయితే స్టార్ గా మార్చి సాయం చేయగలదు. తప్పు చేస్తే పరువు తీయగలదు. వివాదాలు సృష్టించ గలదు.