Begin typing your search above and press return to search.

కోహ్లి కళ్లెదుటే అలా జరిగింది

By:  Tupaki Desk   |   25 Oct 2015 10:33 AM GMT
కోహ్లి కళ్లెదుటే అలా జరిగింది
X
విరాట్ కోహ్లీ కళ్లెదుటే ఆయన రికార్డు బ్రేకయిపోయింది.. చూస్తుండగానే దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా తన రికార్డును ఎత్తుకెల్లిపోయాడు. అతి తక్కువ వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా ఇంతవరకు కోహ్లీ పేరిట ఉన్న ఈ రికార్డు ఇప్పుడు ఆమ్లా వశమైపోయింది.

దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషిమ్ ఆమ్లా సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో వేగంగా 6 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ మ్యాచుల్లో అతడీ ఘనత సాధించాడు. 126 మ్యాచ్ ల్లో 123 ఇన్నింగ్స్ ఆడి అతడీ రికార్డు సృష్టించాడు. భారత్ తో ముంబయిలో జరుగుతున్న ఐదో వన్డేలో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఆమ్లా 23పరుగులు చేసి అవుటయ్యాడు. వ్యక్తిగత 15 పరుగులకు చేరుకోగానే 6 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దీంతో విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు.

కాగా కోహ్లి 144 మ్యాచుల్లో 136 ఇన్నింగ్స్ ఆడి 6 వేల పరుగులు పూర్తి చేశాడు. రిచర్డ్స్, గంగూలీ, డివిలియర్స్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నారు. ఇప్పటివరకు 126 వన్డేలు ఆడిన ఆమ్లా 6008 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 28 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఆమ్లాకు టెస్టుల్లోనూ నిలకడైన బ్యాట్స్ మన్ గా పేరుంది.