Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీలలో చలనం తగ్గిందా?
By: Tupaki Desk | 3 Aug 2020 5:02 PM ISTఏపీ సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందింది. ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా అమరావతి రైతులతో కలిసి ఎంతో రచ్చ చేసి హైకోర్టుకెక్కి నానా రచ్చ చేసి బీభత్సం సృష్టించారు. ఎంతో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ అన్నింటిని తుత్తునియలు చేసి కేంద్రాన్ని ఒప్పించి.. గవర్నర్ చేత ఆమోదం పొందేలా కష్టపడ్డారు సీఎం జగన్.
జగన్ కలలుగన్న మూడు రాజధానుల బిల్లు సాకారం అయిన వేళ వైసీపీ పార్టీ తరుఫున ఈ గెలుపు సందర్భంగా ‘వైఎస్ఆర్ కు క్షీరాభిషేకాలు చేయాలని’ పిలుపునిచ్చారు. కానీ ఈ పిలునకు ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యే, ఎంపీలలో దాదాపు 90శాతం మంది అసలు పార్టీ పిలుపును పట్టించుకోవడం లేదని దీన్నిబట్టి అర్థమైంది. ఆఖరికి విశాఖ పరిపాలన రాజధాని అయితే ఎంతో అభివృద్ధి చెందే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే పట్టించుకోవడం లేదు. పార్టీ పిలుపుకు ఎవరూ స్పందించలేదు.
ఇలా సంవత్సరానికే వైసీపీ ఎమ్మెల్యేల్లో నిరుత్సాహం.. ఉత్సాహం కొరవడిన తీరును పార్టీ అధిష్టానం జీర్ణించుకోవడం లేదు. పార్టీ పిలుపునిచ్చినా ఇంత పెద్ద విజయంలో అస్సలు స్పందించకుండా గోడకు కొట్టిన రాయిలా స్తబ్దుగా ఉండడాన్ని పార్టీ హర్షించడం లేదు. ఇలానే ఉంటే జగన్ నిర్ణయంపై తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే చాన్సులున్నాయి. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు కావాలనే ఈ మూడు రాజధానులను ఒప్పుకోవడం లేదా? లేక బద్దకంతో చేయలేదో తెలియదు కానీ.. ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీలో జోష్ లేకుండా పోయింది.