Begin typing your search above and press return to search.

టీకా విషయంలో కేంద్రం ఫెయిలైందా ?

By:  Tupaki Desk   |   24 March 2021 5:30 PM GMT
టీకా విషయంలో కేంద్రం ఫెయిలైందా ?
X
కరోనా టీకా వేసే విషయంలో కేంద్రం విఫలమైందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా టీకా విడుదలైన తర్వాత 60 ఏళ్ళు దాటిని వారందరు టీకాలు వేయించుకోవచ్చని మొదటచెప్పింది. 60 ఏళ్ళలోపు ఉన్న దీర్ఘ రోగ బాధితులు కూడా టీకాలు వేయించుకునేందుకు వెసులు బాటిచ్చింది. అయితే కేంద్రం ఆశించినట్లుగా స్పందన అయితే పెద్దగా లేదని సమాచారం.

ఎందుకంటే కరోనా టీకాలు కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ విషయంలోనే జనాల్లో పెద్ద అయోమయం పెరిగిపోయింది. మెజారిటి జనాలు కోవీషీల్డ్ ను మాత్రమే ఎంపిక చేసుకోవటం మొదలుపెట్టారు. కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్ రాజకీయా కారణాలతోనే క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే మార్కెట్లోకి విడుదల చేసేశారనే ప్రచారం బాగా జరిగింది. దానికితోడు వైద్య వర్గాలు కూడా కోవ్యాగ్జిన్ టీకాను వ్యతిరేకించటంతో జనాల్లో అనుమానాలు మరింతగా పెరిగిపోయింది.

ఇలాంటి అనేక కారణాల వల్ల కరోనా టీకా వేసుకునే విషయం పెద్దగా సక్సెస్ కాలేదని సమాచారం. 60 ఏళ్ళలోపు వారు అనేకమంది టీకా వేయించుకునే విషయంలో ఆసక్తి చూపినా ప్రభుత్వం పెట్టిన నిబంధనలు అడ్డకింగా మారాయి. దాంతో టీకా వేసుకునే వాళ్ళకి నిబంధనలు అడ్డంకిగాను, వేయించుకోవాల్సిన వాళ్ళు అనుమానంతోను వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ పెద్దగా విజయవంతం కాలేదు.

అందుకనే వేరే దారిలేక చివరకు టీకా వేయించుకునే వయసును కేంద్రం 45 ఏళ్ళకు తగ్గించేసింది. అసలు టీకాలు వేయించుకునేందుకు 60 ఏళ్ళ నిబంధనను ఎందుకు తెచ్చిందో అర్ధం కావటంలేదు. ఎవరికి అవసరమైతే వారు, ఎవరికి ఆసక్తుంటే వారు వేయించుకోవచ్చని చెప్పుంటే ఈపాటికి టీకా ప్రోగ్రామ్ మంచి ఊపుమీదుండేది. మొత్తానికి తాను చేసిన తప్పేమిటో కేంద్రానికి అర్ధమైనట్లుంది. అందుకనే వయస్సును 60 నుండి 45 ఏళ్ళకు కుదించింది.