Begin typing your search above and press return to search.

బీజేపీ సాధించింది శూన్యమా...?

By:  Tupaki Desk   |   13 Sep 2022 10:34 AM GMT
బీజేపీ సాధించింది శూన్యమా...?
X
కేంద్రంలో ఎనిమిదేళ్ల ఏలుబడిలో బీజేపీ సాధించింది ఏంటి అంటే పెదవి విరవాల్సిందేనా. చేదుని దిగమింగాల్సిందేనా. బీజేపీ చేసింది ఏమీ లేదా అంటే జవాబు అదే వస్తోంది. ఈ రోజు దేశ ఆర్ధిక పరిస్థితి చూసినా వేరే ఇతర అంశాలను పరిశీలించినా కూడా బీజేపీ ఏం చేసింది అని అనిపించకమానదు. బీజేపీ మోడీ నాయకత్వాన పూర్తి మెజారిటీతో ఈ దేశాన 2014 నుంచి పాలించడం మొదలెట్టింది. మరి నాటితో పోలిస్తే నేడు దేశ జీడీపీ బాగా పెరిగింది అని చెబుతున్నారు కానీ పెర్ కాపిటా ఇన్ కమ్ ఏమి ఉంది అని లెక్క తీస్తే అసలు ఏమీ పెరగలేదు అనే చెప్పాలి.

అంటే ఒక వైపు దేశం స్థూల జాతీయ ఆదాయం పెరిగింది అని బీజేపీ చెబుతున్న లెక్కలలో డొల్లతనం ఏంటి అన్నది తలసరి ఆదాయం వివరాలు విప్పి చెబుతున్నాయన్నమాట. సరే జీడీపీ పెరిగింది అని తెగ డబ్బు వాయించేస్తున్నారు కదా మరి ఆ డబ్బు ఏమైంది. తలసరి ఆదాయాలలు భారీగా పెరగాలి కదా. ఆ విధంగా ఆ పెరుగుదల కనిపించాలి కదా అన్నదే ఆర్ధిక వేత్తల మేధావుల సూటి ప్రశ్న.

ఈ దేశంలో చూస్తే హీనమైన దైన్యమైన పరిస్థితిలు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి. ఈ దేశం జనాభా దాదాపుగా 140 కోట్ల ప్రజానీకం అనుకుంటే అందులో అతి పెద్ద వాటాగా ఉన్న అరవై కోట్ల మంది ప్రజలు ఈ రోజుకు కూడా చాలా దురవస్థలలో దారిద్ర రేఖకు దిగువన ఉన్నారని అంటున్నరు. అదెలా అంతే వారు రోజు వారీ ఆదాయం వంద రూపాయలకు రావడం లేదు అని లెక్కలు చెబుతున్నాయి. అంటే అత్యంత దారుణంగా వారు బతుకులు వెళ్లదీస్తున్నారు అన్న మాట. దీని మీద ఆర్ధిక నివేదికలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

మరి బీజేపీ చెబుతున్నట్లుగా జీడీపీ అమాంతం పెరిగేసి దేశాన్ని గొప్పగా ఎక్కడో నిలబెడితే ఆ సంపద అంతా ప్రజల ఖాతాలోకి రావాలి కదా వారి జీవన పరిస్థితులు మెరుగు అవాలి కదా. అలాగే వారి తలసరి ఆదాయాలు బాగా ఉండాలి కదా. మరి భారత దేశంలో ఇంతలా కేవలం నెలకు మూడు వేల రూపాయలు కూడా రాని దిక్కుమాలిన పరిస్థితులు ఎందుకు దాపురిస్తున్నాయి అన్నది సూటి ప్రశ్న.

అంటే ఇక్కడ ఒక్కటే విషయం చెప్పుకోవాలి. జీడీపీ నిజంగా పెరిగితే అది జాతీయ సంపదగా మారటం లేదా. జాతీయ జన జీవన స్రవంతి లోకి ఆ సంపద పారుతూ రావడం లేదా అన్నది ఒక ముఖ్యమైన చర్చ. అలా జరగనపుడు ఆ సంపద కొందరి జేబులలోకే వెళ్తోందా అన్నది మరో సందేహం. అంటే భారత దేశంలోనే మరో దేశం ఉంది. అది అమెరికాతో పోటీ పడుతోంది. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. వారి సంపద అనూహ్యంగా పెరుగుతోంది. ఆ విధనా కనుక ఆలోచిస్తే మాత్రం ఈ దేశ జీడీపీ ఎంత పెరిగినా 140 కోట్ల మందికి ఆ సంపద ఫలితాలు అనుభవం లోకి రావడంలేదు అని అనుకోవాలి.

అదే టైం లో ఆ సంపద అంతా కుప్పపోసినట్లుగా ఒకే చోట కూడుకుని ఉందని కూడా అనిపించేలా ఈ లెక్కలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. అలా అయితే ఈ దేశానికి ఉపయోగం ఏమిటి. సంపద పెరగాలి. అది పేదలకు చేరువ కావాలి. తలసరి ఆదాయం కూడా అపుడు పెరుగుతుంది. అదే నిజమైన అభివృద్ధిగా చూస్తారు.

ప్రభుత్వాలు కూడా అదే చేయాలి. పేదలను ముందుకు నడిపించి ఏదో నాటికి దేశంలో పేదరికం లేకుండా చేయడమే అజెండాగా పెట్టుకుని పాలకులు పనిచేస్తే ఈ భారీ ఎత్తున తారతమ్యాలు ఎలా వస్తాయి అన్నది కూడా కీలకంగా చరించాల్సించ విషయం. ఏది ఏమైనా ఈ దేశంలో జీడీపీ పెరగడం అన్నది మంచి పరిణామమైతే దాని ఫలితాలు పేదలకు చేరినపుడే నిజమైన ప్రగతి దారిన నడచినట్లు.

అలా కనుక జరగకపోతే భారత దేశంలో అతి పెద్ద పేద దేశాన్నికొన్ని పదుల కోట్లతో నిందిన పేదరికాన్ని సమీప భవిష్యత్తులో అంతా చూస్తారు అన్నది మాత్రం యధార్ధం. ఇక మొత్తంగా ఎనిమిదేళ్ళ బీజేపీ ఏలుబడిని ఈ దిశగా పరిశీలించినపుడు ఈ దేశానికి బీజేపీ చేసింది శూన్యమే అని అంతా విమర్శలు చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.