Begin typing your search above and press return to search.
ఇంతకీ మోడి ఇచ్చింది సలహానా ? లేకపోతే వార్నింగా ?
By: Tupaki Desk | 11 Nov 2020 4:40 PM ISTషాంఘై కో ఆపరేటివ్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) వేదికగా ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రసంగం తర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. ఎనిమిది సభ్యదేశాల ఎస్సీవో సమావేశం మంగళవారం జరిగింది. వర్చువల్ సాంకేతిక పద్దతిలో జరిగిన సమావేశంలో భారత్ తో పాటు చైనా, పాకిస్ధాన్ లాంటి దేశాలు కూడా పాల్గొన్నాయి.
ఈ సందర్భంగా మోడి మాట్లాడుతు సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతున్న చైనా, పాకిస్ధాన్ దేశాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే ఇఫుడు చర్చనీయంశమయ్యాయి. సభ్యదేశాలన్ని ఒకదానిని మరోటి పరస్పరం గౌరవించుకోవాలని మోడి అన్నారు. పేర్లు పెట్టి ఎవరినీ నేరుగా అనకపోయినా ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నారో మిగిలిన దేశాలకు స్పష్టంగా తెలిసిపోయింది. ఎస్సీవో సభ్యదేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవ్వటానికి భారత్ ఎంతగా కృషి చేస్తోందో మోడి వివరించారు.
దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలంటే ఆయా దేశాల సార్వభౌమాధికారాన్ని ఇతర దేశాలు గుర్తించాలన్న విషయాన్ని మోడి గుర్తుచేశారు. అయితే కొన్ని దేశాలు మాత్రం ఎస్సీవో ఏర్పాటు మూల సూత్రాలకు భిన్నంగా, ద్వైపాక్షిక ఒప్పందాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ చురకలంటించారు. ఎస్సీవో సభ్యదేశాలు ఉద్దేశ్యపూర్వకంగా ఇలా వ్యవహరించటం చాలా దురదృష్టకరమంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధ్యక్షత వహించిన సమావేశంలో మోడి డ్రాగన్, దాయాది దేశాధ్యక్షులు జిన్ పింగ్ , ఇమ్రాన్ ఖాన్ ను ఉద్దేశించి గట్టిగానే చురకలంటిచారు.