Begin typing your search above and press return to search.

బాబు ఆశ‌లు అడియాస‌లేనా?

By:  Tupaki Desk   |   8 Dec 2018 5:21 AM GMT
బాబు ఆశ‌లు అడియాస‌లేనా?
X
``సీట్లు కాదు ముఖ్యం, కూటమి గెలుపు ప్రధానం. సీనియ‌ర్లు అయినా త్యాగం చేయాల్సిందే `` సిద్ధాంత‌ప‌రం గా బ‌ద్ద‌శ‌త్రువైన కాంగ్రెస్ పార్టీ తో పొత్తు పెట్టుకున్న సంద‌ర్భం గా తెలంగాణ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపు. కాంగ్రెస్‌ తో జతకట్టి టీఆర్ఎస్‌ను ఓడించడానికి తన శక్తియుక్తులను `అన్ని విధాలు గా` క్రోడీక‌రించిన చంద్ర‌బాబు నాయుడు ముందస్తు ఎన్నికల పై పెట్టుకున్న ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయ‌ని అంటున్నారు. కచ్చితంగా విజయతీరాలకు చేరతామన్న ఖమ్మం - సత్తుపల్లి - శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో వెనుకపట్టుపట్టినట్టు గా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గెలిచి స్థానాల సంఖ్య తగ్గినట్టుగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నే ప్రచారం జరుగుతుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం.

అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి లోను చేస్తూ కాంగ్రెస్‌ తో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు తొలిరోజు నుంచి టీడీపీ శ్రేణుల‌కు షాకుల మీద షాకులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తొలుత 25 సీట్లు అశించిన ఆ పార్టీ - అనంత‌రం 16 సీట్ల‌ కు తగ్గింది. చివరకు 13 సీట్లతో నే ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. నామినేషన్ల ఆఖరు రోజున మరో సీటు లో కాంగ్రెస్‌ బీఎస్పీ కి మద్దతు ఇవ్వడం ద్వారా పొత్తుకు తూట్లు పొడిచిందని టీడీపీ నేతలు అంటున్నారు. కూటమి పొత్తుల నేపథ్యం లో తెలంగాణ పార్టీ ప్రయోజనాలను బాబు ఫణంగా పెట్టారనే విమర్శిస్తున్నవారూ లేకపోలేదు. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్‌.రమణ - పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి లాంటి వారికి టికెట్లు దక్కక‌పోవ‌డం ప‌చ్చ పార్టీ త‌మ్ముళ్ల‌నే క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింది. అయిన‌ప్ప‌టికీ టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు త‌న‌దైన శైలి లో తెలంగాణ‌ లో విజ‌యం కోసం ఆరాట‌ప‌డ్డారు. ఏ ఐ సీ సీ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ తో కలిసి రాష్ట్రం లో ప్రధానం గా గ్రేటర్‌ హైదరాబాద్‌ లో బహిరంగసభలు - రోడ్‌ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఖమ్మం - కోదాడ తదితర చోట్ల కూడా భారీ సభలు పెట్టి హైప్ క్రియేట్ చేశారు.!

అయితే, శుక్రవారం పోలింగ్‌ జరిగిన నేపథ్యం లో త‌మ పార్టీ గెలుపు పై టీడీపీ నేత‌ల్లో నే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఉప్పల్‌ - కూకట్‌ పల్లి - సనత్‌ నగర్‌ - మలక్‌ పేట - సత్తుపల్లి - అశ్వారావు పేట - ఖమ్మం - మక్తల్‌ - మహబూబ్‌ నగర్‌ - వరంగల్‌ పశ్చిమ - రాజేంద్రనగర్‌ - ఇబ్రహీంపట్నం - శేరిలింగంపల్లి స్థానాల్లో టీడీపీ పోటీచేసింది. నామినేషన్లు వేసే సమయంలో అన్ని స్థానాల్లో గెలుస్తామని టీడీపీ భావించించి. పోలింగ్‌ ముగిసిన తరువాత అంచనాల్లో తేడా వచ్చినట్టు కనిపిస్తున్నది. మొత్తం 13 సీట్లల్లో పోటీచేయగా 12 సీట్లకుగాను ఏడు సీట్లు ఖాయంగా గెలవనున్నట్టు ఆ పార్టీ ధీమా వ్య‌క్తం చేసినప్ప‌టికీ ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో ఖంగు తిన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏడు నుంచి ఎనిమిది స్థానాల్లో మాత్రమే విజయం సాధిస్తామని చెబుతున్నప్ప‌టి కీ - ఖ‌చ్చితంగా విజయ తీరాలకు చేరతామన్న ఖమ్మం - సత్తుపల్లి - శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో నే ఆశించినంత సానుకూల‌త లేద‌ని టీడీపీ శ్రేణులు చ‌ర్చించుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.