Begin typing your search above and press return to search.
క్వారంటైన్ లో హర్యానా సీఎం మనోహర్ !
By: Tupaki Desk | 21 Aug 2020 11:45 AM ISTకరోనా దేశంలో ఎవరిని వదిలిపెట్టడంలేదు. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా భారిన పడుతున్నారు. అసలు కొందరికి ఎలా సోకుతుందో కూడా అర్థం కావడంలేదు. ఇకపోతే తాజాగా హర్యానా సీఎం మనోహర్‌లాల్ కట్టర్ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలని ఆయన నిర్ణయించుకొని హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు ప్రస్తుతానికి కరోనా పరీక్ష చేయించుకోగా..సీఎం కట్టర్ కు కరోనా నెగెటివ్ అని తేలింది.
ఈనెల 19న షెకావత్ తో సట్లేజ్, యమునా నది అనుసంధానంపై జరిగిన చర్చలో మనోహర్ లాల్ కూడా పాల్గొన్నారు. అలాగే ఇటీవల తాను కలిసిన పలువురికి కరోనా సోకందని.. అందుకే ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లోకి వెళ్తున్నాని ఆయన చెప్పారు. కాగా ఈ నెల 26నుంచి హర్యానా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో సమావేశాలు జరుగుతాయా లేదా అన్నది దానిపై అస్పష్టత నెలకొందిన్నారు. ఇదిలా ఉంటే, అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రతిఒక్కరు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఈనేపథ్యంలో కట్టర్ మరోమారు కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు.