Begin typing your search above and press return to search.
కోహ్లీ 'టీం'లో చోటు కోరిన హ్యారీ కేన్ .. కోహ్లీ ఏమన్నాడంటే ?
By: Tupaki Desk | 29 Nov 2020 5:40 PM ISTహ్యారీ కేన్ .. ప్రపంచ స్థాయి ఫుట్ బాల్ ప్లేయర్. ప్రస్తుత ఇంగ్లండ్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్. ఈ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ను ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశాడు. హ్యారీ సహచర ఆటగాళ్లతో కలిసి సరాదాగా క్రికెట్ ఆడాడు. దానికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో ఇంగ్లాండ్ గోల్ కీపర్ జో హార్ట్ బౌలింగ్ చేస్తుండగా.. హ్యారీ బ్యాటింగ్ చేశాడు. కొన్ని షాట్లు దూకుడుగా ఆడిన హ్యారీ చివరికి బౌల్డ్ అయ్యాడు. అయితే , ఆ వీడియో ను ట్యాగ్ చేసి టీ20 మ్యాచ్ లో విజయం సాధించడానికి కావాల్సిన బ్యాటింగ్ నైపుణ్యాన్ని సంపాదించా. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఆర్ సీబీ జట్టులో నాకు స్థానం ఉంటుందా' అని హ్యారీ కేన్ ట్వీట్ చేశాడు. దానికి విరాట్ ట్విట్టర్ అకౌంట్ ట్యాగ్ చేశాడు.
దీనికి విరాట్ కోహ్లీ కూడా ఫన్నీ గానే స్పందించారు. మంచి నైపుణ్యం. ఎటాకింగ్ బ్యాట్స్ మన్ గా నిన్ను జట్టులోకి తీసుకోవచ్చు అని నవ్వుతున్న ఎమోజీలను జోడించి కోహ్లీ రీట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనిపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా స్పందించింది. నీ కోసం ఇప్పుడే జెర్సీ నంబరు 10 సిద్ధం చేసి పెట్టాం అంటూ ట్వీట్ చేసింది. ఐపీఎల్ 2020లో ఆర్సీబీ ప్లే ఆఫ్ చేరిన విషయం తెలిసిందే. హైదరాబాద్ చేతిలో ఓడి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ప్రస్తుతం కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు.
కాగా 27 ఏళ్ల హ్యారీ ఈ ఏడాది ప్రీమియర్ లీగ్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన హ్యారీ, 20 పాయింట్లతో టోటెన్ హామ్ హాట్ స్పర్ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.