Begin typing your search above and press return to search.

విటమిన్​ బిల్లలు అతిగా మింగేయకండి.. దెబ్బైపోతారు !

By:  Tupaki Desk   |   15 Oct 2020 5:00 AM IST
విటమిన్​ బిల్లలు అతిగా మింగేయకండి.. దెబ్బైపోతారు !
X
ప్రస్తుత సీజన్​ లో కరోనా రాకుండా ఉండేందుకు రోగనిరోధక శక్తి పెంచుకోవడం ఒక్కటే మార్గమని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఇమ్యూనిటీని పెంచుకొనేందుకు ప్రజలంతా ఇబ్బడిముబ్బడిగా విటమిన్​ ట్యాబ్లెట్లు వాడేస్తున్నారు. డాక్టర్​ సలహా లేకుండా మెడికల్​ షాప్​కు వెళ్లి మల్టీ విటమన్​ ట్యాబ్లెట్లు కొని మింగేస్తున్నారు. ఇలా అతిగా విటమిన్​ బిల్లలు వాడితే సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి రక్షించుకొనేందుకు అంటూ కొత్త రోగాలను అంట గట్టుకోవద్దని సూచిస్తున్నారు. విటమిన్​ ట్యాబ్లెట్ల వాడకంపై ఎన్​సీబీఐ (నేషనల్​ సెంటర్​ ఫర్​ బయోటెక్నాలజీ ఇన్​ఫర్​మేషన్​) ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

వైరస్​లకు భయపడి, కరోనా వస్తుందేమోనని ఆందోళన చెంది అతిగా విటమిన్​ ట్యాబ్లెట్లు వాడితే ప్రమాదం. దీని వల్ల శరీరం మనకు తెలియకుండానే ఎన్నో మార్పులకు లోనవుతుంది. ఇప్పడు మనం బాగానే ఉన్నట్టు కనిపించినా భవిష్యత్​లో ప్రమాదాలు ఎదురవుతాయి. అతిగా విటమిన్ ట్యాబ్లెట్లు మింగినా.. శరీరంలో విటమిన్ల స్థాయి మోతాదుకు మించి ఎక్కువైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ల స్థాయి మించితే కడుపు లో వికారం ఏర్పడుతుంది. గొంతు నొప్పి, అలసటి వంటి సమస్యలు కూడా రావచ్చు.

విటమిన్-ఏ కంటికి మేలు చేస్తుందన్నది తెలిసిన విషయమే. అయితే విటమిన్​ ఏ ఎక్కువైతే కూడా కంటికే ప్రమాదం. విటమిన్లను మనం ఆహారం రూపంలోనే తీసుకోవాలే తప్ప.. ట్యాబ్లెట్ల రూపంలో తీసుకోవద్దు. విటమిన్-డీ సూర్యరశ్మి నుంచి సహజంగా లభిస్తుంది. చాలామంది ట్యాబ్లెట్లతో త్వరగా విటమిన్స్ పొందాలని ప్రయత్నిస్తున్నారు. విటమిట్-డి ట్యాబ్లెట్లు అధికంగా వాడితే శరీరంలో కాల్షియం స్థాయి అధికమై విషతుల్యాలు పెరుగుతాయని కోకిలా బెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రి సర్వేలో పేర్కొన్నారు. విటమిన్-డి మోతాదుకు మించి తీసుకుంటే కిడ్నీలు చెడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి వీలైనంత వరకు ఆహారపదార్థాల ద్వారానే విటమిన్లు పొందాలని వైద్యులు సూచిస్తున్నారు.