Begin typing your search above and press return to search.
దుబ్బాకలో హరీశ్ సీనే.. గ్రేటర్ లో కేటీఆర్ కు రిపీట్ కానుందా?
By: Tupaki Desk | 28 Nov 2020 7:00 PM ISTకాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అప్పటివరకు కలిసి వచ్చే టైం.. కొన్నిసార్లు ఒక్కసారిగా రివర్సు అవుతుంది. ముట్టుకుంటే బంగారం అయ్యే పరిస్థితి నుంచి.. ఎంత కష్టపడ్డా మట్టి కూడా మిగలని పరిస్థితి. తెలంగాణ అధికారపక్షం పరిస్థితి ఇప్పుడు అలానే ఉందంటున్నారు. ఒకప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పల్లెత్తు మాట అనాలంటే వెనుకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇక..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆయన ఇమేజ్ శిఖరాగ్రానికి చేరుకుంది.
ఒకవేళ.. ఆయన కానీ తాను చెప్పినట్లు దళితుడ్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసి ఉంటే.. తెలంగాణ పితగా చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు. ఒక రాజకీయ పార్టీ అధినేత అంతటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశమే లేదు. అందుకే.. తెలంగాణ రాష్ట్ర పగ్గాలు చేపట్టటమే కాదు.. తన ప్రత్యర్థుల్ని లేకుండా చేసుకోగలిగారు. అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదన్న సత్యాన్ని అంత పెద్దకేసీఆర్ కూడా మర్చిపోయారనే చెప్పాలి.
అధికారంతో వచ్చే అహంకారాన్ని ఆభరణంగా మార్చుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఆయన తీరును తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. ఏపీ ప్రజలకు.. తెలంగాణ ప్రజలకు మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. అధికారంలో ఉన్న వారికి అహంకారంగా ఉండటం వారికున్న హక్కుగా భావిస్తే.. తెలంగాణ ప్రజలు అలాంటి తీరును ఏ మాత్రం ఇష్టపడరు.
దేనికైనా సరే అనే తెలంగాణ ప్రజలు.. ధిక్కారాన్ని ప్రశ్నిస్తారు. ఆ తీరుకు గుణపాఠం చెప్పటానికి ఏ మాత్రం వెనుకాడరు. ఈ కారణంతోనే.. దుబ్బాక ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ తప్పలేదు. దుబ్బాక ఉప ఎన్నిక మొత్తాన్ని తానై నడిపించిన మంత్రి హరీశ్ రావుకు ఊహించనంత షాక్ తగిలింది. అధినేత కేసీఆర్ ఏదైనా టాస్కు ఇస్తే.. దాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ట్రాక్ రికార్డు తన సొంతమని.. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా చెప్పుకున్న హరీశ్ కు.. ఆ ఎన్నిక ఫలితం నోట మాట రాకుండా చేసింది.
తాజాగా గ్రేటర్ ఎన్నిక మొత్తాన్ని తానై అన్నట్లుగా నడిపిస్తున్నారు మంత్రి కేటీఆర్. రోజు మొత్తం అదే పనిగా ప్రచారంలో బిజీబిజీగా ఉంటూనే.. పార్టీ కార్యకలాపాల మీద ఫోకస్ పెడుతున్నారు. గ్రేటర్ లో బీజేపీ గెలుస్తుందని.. మేయర్ ను నియమించేంత మెజార్టీని వస్తుందన్న మాట చెప్పటమే అతిశయోక్తే అవుతుంది. కాకుంటే.. బీజేపీకి 30-40 డివిజన్లలో గెలిచినా.. నైతికంగా విజయంసాధించినట్లే. కేటీఆర్ ఓడినట్లే అవుతుంది. ఇదంతా చూసినప్పుడు దుబ్బాకలో హరీశ్ కు ఎదురైన చేదు అనుభవమే.. గ్రేటర్ లోనూ కేటీఆర్ కు రిపీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఇది అనివార్యమని కూడా అంటున్నారు. అంచనాలు ఇలా ఉంటే.. వాస్తవం మరెలా ఉంటుందన్నది ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.