Begin typing your search above and press return to search.
కుర్చీలు ఎగురుతున్నాయి.. షర్టులు చిరుగుతున్నాయి.. హరీష్ సెటైర్లు
By: Tupaki Desk | 23 Nov 2020 11:45 AM ISTజీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ల రచ్చపై తెలంగాణ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ‘బీజేపీ ఆఫీసులో కుర్చీలు ఎగురుతున్నాయి.. షర్టులు చిరుగుతున్నాయి... మీ మధ్య మీకే సమన్వయం లేదు. ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారు’ అంటూ బీజేపీ నేతలపై మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
హరీష్ మాట్లాడుతూ.. ‘గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నాయకులు ప్రచారానికి వస్తున్నారని.. ఢిల్లీ నుంచి వచ్చే కేంద్రమంత్రులకు నేను ఒకటే చెప్తున్నానని.. రాష్ట్రానికి నిధులు ఇచ్చి ఇక్కడికి రండి.. చార్జీషీట్ అసలు బీజేపీ పైనే వేయాలి.. నిధులు ఇవ్వకుండా తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోంది.. డిసెంబర్ 1న మీ చార్జ్ షీట్ కు హైదరాబాద్ నగర ప్రజలు తగిన బుద్ది చెబుతారు.. బెంగళూరు, గుజరాత్ లలో వరదలు వస్తే డబ్బులు ఇచ్చిన బీజేపీ హైదరాబాద్ కు వరద సాయం ఎందుకు చేయలేదు? ’ అని హరీష్ రావు బీజేపీపై విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ ప్రజల అవస్థలు మీకు పట్టవని.. మేము మీకు ఎందుకు ఓటేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. ఐటీఐఆర్ ను హైదరాబాద్ కు రాకుండా చేసినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో వరదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం కారణమంటున్న కేంద్రమంత్రి జవదేకర్ ముంబై వరదలకు కారణమేవరో చెప్పాలని డిమాండ్ చేశారు.
కరోనాపై తెలంగాణ ప్రభుత్వ చర్యను కేంద్రఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకున్నారని.. కేంద్రమంత్రి జవదేకర్ విమర్శిస్తున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఓట్ల కోసం టీఆర్ఎస్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోందని విమర్శించారు.