Begin typing your search above and press return to search.
బ్రేకింగ్: మంత్రి హరీష్ రావుకు కరోనా
By: Tupaki Desk | 5 Sept 2020 12:45 PM ISTతెలంగాణలో వరుసగా ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడుతున్నారు. తీవ్రత రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 30మంది ఎమ్మెల్యేల వరకు కరోనా బారిపడినట్లు సమాచారం. తాజాగా మంత్రులను కూడా కరోనా వదిలిపెట్టడం లేదు.
తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కాగా తనకు కరోనా రావడంతో తనను కలిసిన వారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని నేతలు, అధికారులకు హరీష్ రావు సూచనలు చేసినట్టు సమాచారం.
అయితే హరీష్ రావుకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.