Begin typing your search above and press return to search.
కొత్త లెక్క చెబుతున్న హరీశ్.. ఎవరి అడ్డా వారిదేనట!
By: Tupaki Desk | 8 Oct 2020 9:10 PM ISTమాటలు నేర్చిన చిలుక ఏమైనా చెబుతుందన్న మాటకు తగ్గట్లుగా ఉంది తెలంగాణ రాష్ట్ర మంత్రి కమ్ సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు సంగతి చూస్తుంటే. తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచేసేలా వరుస ఎన్నికలు రావటంతో అధికారపక్ష నేతలంతా అలెర్టు అయిపోతున్నారు. త్వరలో జరిగే దుబ్బాక ఉప ఎన్నిక మంత్రి హరీశ్ రావుకు మరింత పర్సనల్ గా మారింది.
తానా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు అలా ఇలా అన్నట్లు ఉండొద్దని.. తనకున్న పరపతి ఏపాటిదన్న విషయాన్ని దుబ్బాక ఉప ఎన్నిక ద్వారా తెలిసేలా చేయాలని భావిస్తున్నారు. అందుకే.. ఆయన కాలికి బలపం కట్టుకొని మరీ తిరుగుతున్నారు. దుబ్బాక అభ్యర్థి తరఫున అన్నీ తానై అన్నట్లు అండగా నిలుస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా హరీశ్ నోటి నుంచి వస్తున్న మాటలు మరింత సిత్రంగా వినిపిస్తున్నాయి. దుబ్బాకలో తాము తప్పించి మరెవరూ పోటీ చేయకూడదన్నట్లుగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. అదేమంటే.. తెలంగాణ ఉద్యమ వేళ.. ఆందోళనలో పాల్గొన్న వారిని మీరెప్పుడైనా పరామర్శించారా? అని ప్రశ్నిస్తున్న హరీశ్.. దుబ్బాకలో ఎన్నో కేసులు నమోదైతే బాధితుల పక్షాన వచ్చి అండగా నిలిచింది తామేనని.. అందుకే తమకు మాత్రమే ఓట్లు అడిగే అవకాశం ఉందనిచెబుతున్నారు.
దుబ్బాకలో చదువుకున్న బిడ్డగా సీఎం కేసీఆర్ కు ఉన్న కడుపునొప్పి.. దుబ్బాక మీద తాపత్రయం ఉత్తమ్ కుమార్ రెడ్డికో? దామోదర రాజ నర్సింహకో ఉంటుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. హరీశ్ మాటల ప్రకారం చూస్తే.. ఏ నేతకు చెందిన ఊరు.. అత్తారి ఊరి మీద వారికి మాత్రమే ప్రేమ ఉంటుందా? మరే నేతకు ప్రేమ ఉండదా? అన్న సందేహాలు రాక మానవు. అయినా.. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక..ఒక ప్రాంతానికి.. ఒక నియోజకవర్గానికి మాత్రమే ముఖ్యమంత్రాఅన్న సందేహాలు రాక మానదు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న అధినేతకు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానమే. అంతేకానీ.. ఒక ప్రత్యేకం.. మరొకరు మరింత ప్రత్యేకం లాంటివి వినేందుకు బాగుండవన్న విషయాన్ని హరీశ్ ఎప్పుడు గుర్తిస్తారో?చిన్న పిల్లల మాదిరి ఈ అడ్డాల గోలేంటి హరీశ్?