Begin typing your search above and press return to search.

హరీష్ వ్యాఖ్యల కలకలం.. ఇలా అన్నాడేంటి.?

By:  Tupaki Desk   |   7 Nov 2018 4:28 PM IST
హరీష్ వ్యాఖ్యల కలకలం.. ఇలా అన్నాడేంటి.?
X
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ నానా ప్లాన్లు వేసి అక్కడి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత నర్సారెడ్డిని కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. అనంతరం గజ్వేల్ లో కేసీఆర్ గెలుపు బాధ్యతను భుజానా వేసుకున్న హరీష్ రావును టార్గెట్ చేసి కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.. కేసీఆర్ ను ఓడించాలని హరీష్ రావు తనతో మాట్లాడినట్టు ప్రతాప్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశమయ్యాయి. వీటికి కౌంటర్ ఇచ్చే క్రమంలో తాజాగా దీపావళి పూట హరీష్ రావు స్థాయిని మరిచి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీటి పై టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

తాజాగా బుధవారం హరీష్ రావు మాట్లాడుతూ ప్రతాప్ రెడ్డి, రేవూరి నాలుక చీరేస్తా అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా వాడు, వీడు అంటూ దారుణమైన పదజాలం వాడారు. హరీష్ రావు తాను టీఆర్ఎస్ పార్టీ విధేయుడిని అని చెప్పుకునేందుకు ఇలా నోరుజారడం కలకలం రేపుతోంది. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా దిగజారినట్టు మాట్లాడడం పై టీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు సహజమని.. ఇలా సహనం కోల్పోయి మాట్లాడడం దారుణమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల పై ఈసీ స్పందిస్తే హరీష్ చిక్కుల్లో పడే అవకాశం ఉంది.