Begin typing your search above and press return to search.

బ్యాటింగ్ మొదలుపెట్టిన హరీష్ రావు!

By:  Tupaki Desk   |   16 Nov 2020 10:15 AM IST
బ్యాటింగ్ మొదలుపెట్టిన హరీష్ రావు!
X
రాజకీయాల్లో ఈజీగా బ్యాటింగ్ చేయడం మంత్రి హరీష్ రావుకు అలవాటు.. అలా చాలా పొలిటికల్ గేముల్లో ఆయన గెలిపించారు. కానీ ఇప్పుడు నిజంగానే ఫీల్డ్ లో దిగి రఫ్పాడించారు. తన నిజమైన బ్యాంటింగ్ తో దుమ్ముదులిపారు.

సిద్దిపేట స్టేడియంలో మంత్రి హరీష్ రావు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ను ఆదివారం రాత్రి ప్రారంభించారు. మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ మధ్య 20-20 క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు.

టాస్ వేసిన అనంతరం కాసేపు క్రికెట్ ఆడారు. ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి అనంతరం బౌలింగ్ చేశారు. హరీష్ బ్యాటింగ్ చేస్తుండగా.. సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ బౌలింగ్ చేయగా.. హరీష్ వినూత్న షాట్లు కొట్టి అలరించారు. హరీష్ బ్యాటింగ్ శైలి చూసి అక్కడున్న వారంతా చప్పట్లతో హోరెత్తించారు. దుబ్బాక ఎన్నికలతో బాగా టైడ్ అయిపోయిన హరీష్ ఇలా పోలీసు క్రీడల్లో సేదతీరారు. క్రీడాకారులతోపాటు వీక్షకులందనీ బ్యాటింగ్ తో ఆశ్చర్యానికి గురిచేశారు.

నిత్యం బిజీగా ఉండే హరీష్ ఆదివారం క్రికెట్ ఆడుతూ తర్వాత మినీ ట్యాంక్ బండ్ పై చిన్నారులతో సరదాగా సేదతీరారు. సిద్దిపేటలో సందడి చేశారు. తన ఒత్తిడిని అంతా దించుకున్నారు.