Begin typing your search above and press return to search.

హరీష్ సంచలన నిర్ణయాలు..అసలేం జరుగుతోంది?

By:  Tupaki Desk   |   1 Feb 2019 12:37 PM IST
హరీష్ సంచలన నిర్ణయాలు..అసలేం జరుగుతోంది?
X
ఆర్టీసీ టీఎంయూ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి 24 గంటలైనా గడవకముందే టీఆర్ ఎస్ నేత హరీష్ రావు మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఏకంగా తన మినిస్టర్ బంగళా ఖాళీ చేశారు హరీష్. బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో ఉన్న తన అధికారిక బంగళాను హరీష్ ఖాళీచేశారు. కొండాపూర్ లో ఉన్న తన సొంతింటికి వెళ్లిపోయారు.

తెలంగాణ ప్రభుత్వంలో మరికొన్ని రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల మధ్య హరీష్ రావు ఇలా వరుసగా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. మంత్రివర్గంలో ఈసారి హరీష్ కు చోటుదక్కకపోవచ్చనే ఊహాగానాల మధ్య తన అధికారిక నివాసాన్ని హరీష్ ఖాళీ చేయడం పుకార్లకు మరింత ఊతమిచ్చింది.

మంత్రివర్గంలో హరీష్ కు చోటుదక్కదేమో అనే అనుమానాలతో పాటు ఒంటేరు ప్రతాపరెడ్డి టీఆర్ ఎస్ చేరిక కూడా హరీష్ కోపానికి కారణంగా తెలుస్తోంది. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై కాంగ్రెస్ తరఫున పోటీకి దిగారు ఒంటేరు. ఆ టైమ్ లో కేసీఆర్ తరఫున ప్రచారం చేసిన హరీష్ రావుకు - ప్రతాప్ రెడ్డికి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. కట్ చేస్తే.. నెల రోజులు కూడా గడవకముందే ఒంటేరును పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. ఆ చేరిక కార్యక్రమంలో కూడా హరీష్ పాల్గొనలేదు. ఇలాంటి పలు కారణాలన్నీ కలిసి హరీష్ ను హర్ట్ చేశాయని అంటున్నారు ఆయన సన్నిహితులు.